నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “A”.ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సారు దగ్గర యు/ఎ సర్టిఫికెట్ సాధించింది.
సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు యుగంధర్ మాట్లాడుతూ..' ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్స్ లో చాలా మూవీస్ వచ్చాయి. వాటన్నిటి కంటే భిన్నంగా మా A సినిమా ఉంటుంది.
కొత్తధనంతో ఏ సినిమా తీసినా ఆదరిస్తామని ప్రేక్షకులు ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని పెయిర్ చాలా బాగుంది. చిన్న సినిమా అయినా సినిమా నచ్చి పివిఆర్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్నారు.
నిర్మాత గీతా మిన్సాల మాట్లాడుతూ..' యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి 'A' చిత్రాన్ని బడ్జెట్ కి వెనకాడకుండా నిర్మించాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అలాగే పివిఆర్ లాంటి బిగ్ బ్యానర్ ద్వారా మా చిత్రం ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతుంది.. అన్నారు.