cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్: రేపు సాంగ్ రిలీజ్.. ఈరోజు స్పెషల్ షో

ఆర్ఆర్ఆర్: రేపు సాంగ్ రిలీజ్.. ఈరోజు స్పెషల్ షో

ప్రచారం విషయంలో రాజమౌళి వ్యూహాలు ఊహకందవు. బాహుబలితోనే ఈ విషయం ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి అందరికీ తెలిసొస్తోంది. మెల్లమెల్లగా ప్రచారాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్తున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లలో వినూత్న పోకడలు ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు మరో కొత్త ప్లాన్ తో ముందుకు రాబోతున్నాడు.

ఇన్నాళ్లూ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి లిరికల్ వీడియోస్ విడుదల చేస్తూ హంగామా చేశారు. ఇది అందరూ చేసే పనే. ఈ క్రమంలో మరో సాంగ్ కూడా రెడీ అయింది. అది రేపు విడుదల కాబోతోంది. సరిగ్గా ఇక్కడే రాజమౌళి ఓ కొత్త పద్ధతి ఫాలో అవుతున్నాడు.

వాస్తవానికి రేపు విడుదల కాబోతున్నది లిరికల్ వీడియో కాదు. అదొక ఎమోషనల్ వీడియో సాంగ్. దానికి ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథెమ్ అనే పేరు కూడా పెట్టేశారు. ఆ సాంగ్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. రేపు ఏ పాటనైతే విడుదల చేయబోతున్నారో, ఆ పాటను ఈరోజు ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. తెలుగు మీడియా మొత్తాన్ని ఆహ్వానించి.. జనని అనే లిరిక్స్ తో సాగే ఆ ఎమోషనల్ సాంగ్ ను, ఈరోజే చూపించబోతున్నారు.

సినిమాకు ఎలాగైతే ముందురోజు ప్రివ్యూలు, బెనిఫిట్ షోలు ఉంటాయో.. అలా ఓ పాటకు ముందురోజు స్పెషల్ షో ఏర్పాటు చేశాడన్నమాట జక్కన్న. ప్రచారంలో ఇదో మంచి ఎత్తుగడగా చెబుతున్నారు సినీజనాలు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!