ఆర్ఆర్ఆర్ సినిమా టాలీవుడ్ లోని మిగిలిన సినిమాలతో తన చిత్తానికి ఆడుకుంటోంది. ఆ మధ్యన అయితెే ఇది లేకుంటే అది అంటూ రెండు డేట్ లు ప్రకటించారు. దాంతో ముందు రావాలో? వెనుక రావాలో తెలియక మిగిలిన సినిమాలు అయోమయంలో పడ్డాయి.
అసలే ఆంధ్రలో సెకెండ్ షో లేదు. పూర్తి ఆక్యుపెన్సీ లేదు. ఎప్పటికి సరి చేస్తారో తెలియదు. ఇలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ మళ్లీ షాక్ ఇచ్చింది.
ఈసారి మార్చి 25 ఫైనల్ అంటూ డేట్ వదిలారు. దాంతో ఆచార్య సినిమా మళ్లీ వాయిదా పడింది. ఆ సినిమా ఏకంగా ఏప్రిల్ 29కి వెళ్లిపోయింది. రాధేశ్యామ్ డేట్ ను అధికారికంగా మార్చి 11 అని ప్రకటిస్తారు అని వార్తలు వినవస్తుండగానే ఆర్ఆర్ఆర్ డేట్ వచ్చేసింది. పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, ఆచార్య డేట్ లు వచ్చేసినట్లే.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాత్రమే అయోమయంలో పడింది. ఫిబ్రవరి 25 రావాలంటే రేట్లు వస్తాయో రావో తెలియవు. కోవిడ్ నిబంధనలు ఏమవుతాయో తెలియదు. ఆ డేట్ వదిలేస్తే మళ్లీ మే వరకు డేట్ లు లేవు. చూడాలి ఏం డిసైడ్ చేస్తారో?