Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్ ను టార్గెట్ చేసిన 'సర్కారు'?

ఆర్ఆర్ఆర్ ను టార్గెట్ చేసిన 'సర్కారు'?

సర్కారు వారి పాట సినిమాలో కీలకమైన రెండు పాత్రల్లో విలన్ సముద్రఖని పాత్ర ఓకటి. ఈ పాత్ర చేసిన పని వేల కోట్లు బ్యాంక్ నుంచి తీసుకుని ఎగ్గొట్టడం. అలాంటి పనులు చేసిన పారిశ్రామిక వేత్తలు చాలా మందే వున్నారు. వీళ్లకు రాజకీయాలతో లింక్ వుంది. 

కానీ కేవలం రాజకీయ వేత్తగా వుంటూ రుణాలు ఎగ్గొట్టిన పాత్రగా సముద్రఖనిని ప్రొజెక్ట్ చేసారు. పైగా రుణంగా తీసుకున్న డబ్బులో పార్టీ అధిష్టానానికి కొంత,  కేంద్ర మంతులకు కొంత ఇచ్చేసానని, మిగిలినది తాను వాడేసుకున్నానని గర్వంగా చెబుతుందీ పాత్ర. 

ఈ పాత్రతో దర్శకుడు పరుశురామ్ పరోక్షంగా నైనా రాజకీయ నాయకుడు రఘురామ కృష్ణం రాజును టార్గెట్ చేసారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రఘురామ కృష్ణం రాజు అంటే రాజకీయ వేత్తగానే జనాలకు తెలుసు. ఆయన ఎందుకు అప్పు తీసుకున్నారో తెలియదు. కానీ ఆయన బ్యాంకు రుణాలను బకాయిపడ్డారని తెలుసు.

అంతే కాదు ఢిల్లీలో ప్రతి మంత్రి దగ్గరకు వెళ్లడం, పలకరించి తన పలుకుబడి చాటడం వంటి సీన్లు, తరచు రఘురామకృష్ణం రాజు పొలిటికల్ లైఫ్ లో కనిపిస్తుంటాయి. ఆయన నిత్యం ఢిల్లీలో మంత్రులను కలుస్తుంటారు. ఫొటోలు దిగి వదులుతుంటారు. 

సముద్రఖని పాత్రకు ఆర్ఆర్ఆర్ కు లింక్ లేదు..పోలికలు కూడా యాదృచ్ఛికం కావచ్చు. లేదా ఊహాత్మకం కావచ్చు. కానీ వైకాపా శ్రేణులు మాత్రం ఇలాగే డిస్కస్ చేసుకోవడం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?