కొనేవాళ్లు వుండాలే కానీ ఎంత కయినా అమ్ముకోవచ్చు. అటు మెగా హీరో, ఇటు నందమూరి హీరో వున్నారు. ఇంక లోటే ముంది టికెట్ కోసం ఎగబడే వాళ్లకు. అందుకే 25 తెల్లవారు ఝామున కూకట్ పల్లి, మూసా పేట్ పరిసర ప్రాంతాల్లో వేసే ఆరు స్పెషల్ షో లకు టికేట్ రేట్ అయిదు వేలుగా డిసైడ్ చేసారు.
డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ రేటుకు ఈ షో లను విక్రయించారు. దానికి అదనంగా అనుమతులు, మొహమాటాలు, ఇలాంటివి అన్నీ కలుపుకుని, లాభం వేసుకుని అయిదువేలుగా రేటును డిసైడ్ చేసారు.
అయిదు థియేటర్లు..సుమారుగా అయిదు వేల టికెట్లు..అయిదు వేల రేట్లు..అంటే రెండున్నర కోట్ల వ్యాపారం. కేవలం ఫ్యాన్స్ క్రేజ్, సినిమా మీద బజ్ ఆధారంగా అన్నమాట. ఇదిలా వుంటే ట్విట్టర్ లో ఫ్యాన్స్ గడబిడ మొదలైంది.
ఫ్యాన్స్ కొనలేనంత రేట్లు పెడుతున్నారని, బెనిఫిట్ షో నిర్వాహకులను తిట్టడం మొదలుపెట్టారు. బెనిఫిట్ షో నిర్వాహకులతో సంబంధం వుందనే అనుమానంతో ఓ యువ నిర్మాత మీద కూడా విపరీతంగా తిట్లు లంకించుకున్నారు.
ఇదిలా వుంటే టికెట్ లు అనుకున్న రేంజ్ లో అమ్ముడవుతాయో లేదో అనే ఆలోచనతో ఈ బెనిఫిట్ షో కి తారక్. చరణ్ హాజరవుతారనే రూమర్లను వార్తలుగా మార్చి ప్రచారం సాగించడం కొసమెరుపు.