రాధేశ్యామ్ రికార్డు..ఆర్ఆర్ఆర్ అవ‌లీల‌గా?

పోస్ట్ ప్యాండ‌మిక్ ప‌రిస్థితుల్లో తొలి రోజే అత్యంత భారీ గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమా రాధేశ్యామ్ నిలుస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య‌న విడుద‌లైన ఈ సినిమా తొలి రోజున 89 కోట్ల రూపాయ‌ల గ్రాస్…

పోస్ట్ ప్యాండ‌మిక్ ప‌రిస్థితుల్లో తొలి రోజే అత్యంత భారీ గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమా రాధేశ్యామ్ నిలుస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య‌న విడుద‌లైన ఈ సినిమా తొలి రోజున 89 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిందని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. ఇది వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్.

ఆ భారీ వ‌సూళ్లు కూడా ఆ సినిమాను హిట్ అనిపించ‌లేక‌పోయాయి. డివైడ్ టాక్ ఫ‌లితంగా.. తొలి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల ధాటి ఆ త‌ర్వాత కొన‌సాగ‌లేదు. మ‌రి రాధేశ్యామ్ కన్నా భారీ అంచ‌నాల మ‌ధ్య‌న వ‌స్తున్న ఆర్ఆర్ఆర్..  తొలి రోజు వ‌సూళ్లు ఏ స్థాయి అనేది హాట్ టాపిక్. 

సినిమాల రేంజ్ ఏమిటో చెప్ప‌డానికి తొలి రోజు వ‌సూళ్లే ప్రాతిప‌దిక‌గా మారి చాలా కాలం అయ్యింది. ఈ నేప‌థ్యంలో.. భారీ అంచ‌నాల మ‌ధ్య‌న వ‌స్తున్న ఈ భారీ సినిమా తొలి రోజు ఏ స్థాయి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని స‌ర్వత్రా ఆస‌క్తి రేపుతున్న అంశం.

అంచ‌నాలు, బ‌డ్జెట్, మార్కెట్ ప్ర‌కారం చూసుకున్నా.. రాధేశ్యామ్ ఫ‌స్ట్ డే గ్రాస్ వ‌సూళ్ల‌ను ఆర్ఆర్ఆర్ నిస్సందేహంగా దాటేయాల్సిందే! మ‌రి ఆ నంబ‌ర్లు ఎంత‌నేది మ‌రి కొన్ని గంట‌ల్లో స్ప‌ష్ట‌త రావొచ్చు!