వెంకీ సినిమాలో ‘హిట్’ హీరోయిన్

సైంధవ్.. వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. 'హిట్' ఫ్రాంచైజీతో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు.. ఈ సినిమాలోకి తనకు కలిసొచ్చిన రుహానీ శర్మను కూడా తీసుకున్నాడు. సైంధవ్…

సైంధవ్.. వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. 'హిట్' ఫ్రాంచైజీతో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు.. ఈ సినిమాలోకి తనకు కలిసొచ్చిన రుహానీ శర్మను కూడా తీసుకున్నాడు. సైంధవ్ లో రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించనుందంటూ ఈరోజు ప్రకటన వచ్చేసింది.

వెంకటేష్ బీస్ట్ మోడ్ లో కనిపించనున్న ఈ సినిమాలో నాని ఓ స్పెషల్ రోల్ లో మెరవనున్నాడనే విషయాన్ని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇప్పుడు రుహానీ శర్మను కూడా రిపీట్ చేసి, తన 'హిట్' సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు శైలేష్ కొలను.

తాజా ప్రకటనతో సైంధవ్ లో హీరోయిన్ల లిస్ట్ ఫైనల్ అయింది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ హీరోయిన్లు. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని తీసుకున్నారు. ఇతర నటీనటుల వివరాల్ని దశలవారీగా ప్రకటించనున్నారు.

నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది సైంధవ్.