ఉగ్రం…మిస్సింగ్ మిస్టరీ

మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం…అదే కనిపించకుండా పోతే జీవితాంతం బాధపడతాం. అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మిస్తున్న ఉగ్రం సినిమా ట్రయిలర్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ చుట్టూనే…

మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం…అదే కనిపించకుండా పోతే జీవితాంతం బాధపడతాం. అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మిస్తున్న ఉగ్రం సినిమా ట్రయిలర్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ చుట్టూనే కథ అల్లుకున్నారు. 

దేశంలో నిత్యం వేలాది మంది పిల్లలు, పెద్దలు కనిపించకుండా పోతున్నారు. వీటిలో హ్యూమన్ ట్రాఫికింగ్, మెడికల్ మాఫియా, బెగ్గింగ్ మాఫియా ఇలాంటి అనేక అంశాలు, వాటి వెనుక దాగిన చీకటి కోణాలు వున్నాయి. వీటి మీద ఫోకస్ పెట్టి కథ రాసుకుని, సినిమా రూపొందించినట్లుంది దర్శకుడు విజయ్.

అల్లరి నరేష్ పూర్తి స్థాయిలో సీరియస్, పెరోషియస్ రోల్ చేసినట్లు కనిపిస్తోంది. రెండు నిమిషాల 27 సెకెండ్ల ట్రయిలర్ లో తొలిసగం సబ్జెక్ట్ మీద వెళ్లారు. మలిసగం యాక్షన్ సీన్లకు కేటాయించారు. కథ మరీ కొత్తగా ఊహించలేనంతగా లేదనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. మిస్సింగ్ కేసులను పరిశోధించే సిన్సియర్ పోలీస్ అధికారి, అతనికి వచ్చే అడ్డంకులు, బలమైన విలన్, పోరాటాలు ఇవన్నీ కలిసి సినిమా అన్నట్లు క్లారిటీ ఇచ్చేసారు ట్రయిలర్ లో.

నిజానికి ట్రయిలర్ నిడివిని సరిగ్గా వాడుకోలేదు దర్శకుడు. కొన్ని షాట్లు ఒకే సీన్ లోంచి రెండు మూడు కట్ చేసినట్లుంది. ఉగ్రం సినిమా మే అయిదున విడుదలవుతోంది.