ఈ వయసులో కూడా ఐటెంసాంగ్ ఆఫర్లు

హీరోలకు దశాబ్దాల కెరీర్ ఉండడం సహజం. హీరోయిన్లు అన్నేళ్లు బండి లాగిస్తే మాత్రం కచ్చితంగా వింతే. ఇంకా చెప్పాలంటే అదొక రికార్డ్ కూడా అవుతుంది. హీరోయిన్ శ్రియ ఈ కోవకే చెందుతుంది. 22 ఏళ్ల…

హీరోలకు దశాబ్దాల కెరీర్ ఉండడం సహజం. హీరోయిన్లు అన్నేళ్లు బండి లాగిస్తే మాత్రం కచ్చితంగా వింతే. ఇంకా చెప్పాలంటే అదొక రికార్డ్ కూడా అవుతుంది. హీరోయిన్ శ్రియ ఈ కోవకే చెందుతుంది. 22 ఏళ్ల కిందట కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీకి ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

టాలీవుడ్ కాకపోతే బాలీవుడ్.. అది కూడా లేకపోతే కోలీవుడ్.. ఇలా ఏదో ఒక ఇండస్ట్రీలో శ్రియ మెరుస్తూనే ఉంది. మొన్నటికిమొన్న కన్నడలో కబ్జా సినిమా చేసింది. త్వరలోనే మ్యూజిక్ స్కూల్ అనే సినిమాను 3 భాషల్లో విడుదలకు సిద్ధం చేసింది. ఓవైపు ఇలా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఐటెంసాంగ్స్ చేస్తూ కెరీర్ ను పరుగులుపెట్టిస్తోంది ఈ బ్యూటీ.

ఓవైపు సీనియర్ల సరసన నటిస్తూ, ఇంకోవైపు డీ-గ్లామర్ రోల్స్ పోషిస్తున్నప్పటికీ శ్రియకు ఐటెంసాంగ్స్ ఆఫర్లు వస్తుండడం విశేషమే. వీటి కంటే పెద్ద విశేషం ఏంటంటే.. 40 ఏళ్ల వయసులో కూడా ఆమెకింకా స్పెషల్ సాంగ్ అవకాశాలొస్తున్నాయి. ఆమె ఫిజిక్, మెయింటెనెన్స్ అలాంటివి.

తాజాగా మరో ఐటెంసాంగ్ ఆఫర్ కు దగ్గరైంది శ్రియ. ఈసారి ఏకంగా చిరంజీవి సరసన ఐటెంసాంగ్ చేయబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, భోళాశంకర్ లో శ్రియ స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఒకప్పుడు చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఆయన సినిమాలో ఐటెంసాంగ్ కు రెడీ అయింది. 17 ఏళ్ల కిందటే ఐటెంసాంగ్స్ చేయడం మొదలుపెట్టిన ఈ అందగెత్తకు, ఇంకా అలాంటి ఆఫర్లు రావడం విచిత్రమే.