బాలీవుడ్ నటి రుక్సర్ రెహ్మాన్ తన రెండో భర్త ఫరూఖ్ కబీర్‌తో విడిపోయినట్లు స్వయంగా ప్రకటించింది. గత కొంత కాలంగా ఇరువురు దూరంగా ఉంటున్నారంటూ వస్తున్నా వార్తలపై రుక్సర్ స్పందిస్తూ.. అందరూ అనుకుంటున్నట్లు ఇద్దరు విడిపోయినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నుండే విడివిడిగా ఉంటూ.. విడాకులకు కూడా దరఖాస్తూ చేసుకున్నట్లు మీడియాతో మాట్లాడారు.
రుక్సర్ రెహ్మాన్ 19 సంవత్సరాల వయస్సులోనే యాద్ రాఖేగీ దునియా చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది, ఇందులో ఆమె ఆదిత్య పంచోలి (1991) సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రెండవ చిత్రం ఇంతేహా ప్యార్ కి, ఇందులో ఆమె రిషి కపూర్ (1992) సరసన నటించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డి, సర్కార్ సినిమాలతో పాటు. పీకే, గాడ్ టుస్సి గ్రేట్ హో, 83, ఖుదా హఫీజ్ 2 వంటి పలు చిత్రాల్లో నటించింది.
కాగా రుక్సర్ తొలుత అసద్ అహ్మద్‌ను పెళ్లాడింది. వీరికి ఐషా అహ్మద్ అనే కూతురు జన్మించింది. ఈమె కూడా నటిగా సినిమాల్లో రాణిస్తోంది. అసద్‌తో విడాకుల అనంతరం ఫరూఖ్ కబీర్‌తో అరేళ్ల పాటు డేటింగ్లో ఉండి 2010లో పెళ్లి చేసుకుంది.