పరిసమాప్తం.. రూలర్ కథ ముగిసింది

విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రూలర్ సినిమా 2 వారాలకే దుకాణం సర్దేసింది. కనీసం పండగ వరకైనా సినిమాను ఎలాగోలా లాగించాలన్న నిర్మాత సి.కల్యాణ్ ఆశలు నెరవేరలేదు. ఈ 14 రోజుల్లో…

విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రూలర్ సినిమా 2 వారాలకే దుకాణం సర్దేసింది. కనీసం పండగ వరకైనా సినిమాను ఎలాగోలా లాగించాలన్న నిర్మాత సి.కల్యాణ్ ఆశలు నెరవేరలేదు. ఈ 14 రోజుల్లో రూలర్ సినిమా కనీసం 40శాతం కూడా రికవర్ అవ్వలేదు. దీంతో రెవెన్యూ పరంగా ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 20 కోట్ల రూపాయలకు అమ్మారు. శుక్రవారం నాటి వసూళ్లతో కలుపుకొని రూలర్ కు 8 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రతిరోజూ పండగే, మత్తువదలరా లాంటి సినిమాలు గట్టిగా నిలబడ్డంతో పాటు చాలా చిన్న సినిమాలు థియేటర్లను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రూలర్ సినిమాను తప్పనిసరి పరిస్థితుల మధ్య దాదాపు 50శాతం థియేటర్ల నుంచి తొలిగించాల్సి వచ్చింది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విడుదలైన 2 రోజులకే వెలవెలబోయింది రూలర్. మొదటి వీకెండ్ దాటిన తర్వాత ఈ సినిమాను ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈ సినిమాతో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య. కొత్త ఏడాదిలో బోయపాటి సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు.