తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ బాగా పడిపోయింది. ఎగబడి డబ్ములు ఇచ్చి కొనేంత సీన్ ఇప్పుడు అంతగా లేదు. సూపర్ స్టార్ల సినిమాలే అడ్వాన్స్ ల మీద డిస్ట్రిబ్యూషన్ కు ఇస్తున్నారు. ఇక మిగిలిన సినిమాల సంగతేమిటి?
లేటెస్ట్ గా రాబోతున్న బాలయ్య రూలర్ సినిమాను ఇలాగే డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేసారు. అది కూడా ఏ అడ్వాన్స్ లేకుండా. పైగా ఖర్చులు కూడా నిర్మాతవే.
జస్ట్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ చేయడం వరకే అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్ వంతు. మామూలుగానే బాలయ్య సినిమాలకు అమెరికాలో అంత క్రేజ్ వుండదు.
క్లాస్ టచ్ వున్న గౌతమీ పుత్ర శాతకర్ణి, ఆ మధ్య వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లు మాత్రం కాస్త రేటు పెట్టి కొన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఘోరమైన నష్టాలు మిగిల్చింది.
ఇలాంటి నేపథ్యంలో రూలర్ లాంటి మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను అమెరికాలో ఎవరు కొంటారు. అందుకే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, అది కూడా ఖర్చులు భరించి మరీ ఇచ్చేసారు. ఏమైనా వస్తే వస్తాయి. లేదంటే లేదు.