సాహో యాక్షన్ మూవీ కాదు

సాహోలో భారీ ఛేజింగ్ సీన్లు ఉన్నాయి. హెవీ ఫైట్స్ ఉన్నాయి. ఫారిన్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. ఈమధ్య కాలంలో తెలుగులో ఇంత భారీ యాక్షన్ సినిమా రాలేదంటున్నారంతా. కానీ ప్రభాస్ మాత్రం సాహోను యాక్షన్…

సాహోలో భారీ ఛేజింగ్ సీన్లు ఉన్నాయి. హెవీ ఫైట్స్ ఉన్నాయి. ఫారిన్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. ఈమధ్య కాలంలో తెలుగులో ఇంత భారీ యాక్షన్ సినిమా రాలేదంటున్నారంతా. కానీ ప్రభాస్ మాత్రం సాహోను యాక్షన్ మూవీ కంటే ఎమోషనల్ సినిమాగానే భావిస్తున్నాడు.

“సాహోలో ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. శ్రద్ధాకపూర్ క్యారెక్టర్ చుట్టూ కథ ట్రావెల్ అవుతుంది. యాక్షన్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు, ఉత్తేజాన్ని కలిగించేలా కారు రేసులు, బైక్ రేసులు ఉంటాయి. యాక్షన్ ను కాస్త కొత్తగా, స్టయిలిష్ గా చూపించాం. కానీ యాక్షన్ కంటే ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తుంది.”

సాహోకు సంబంధించి తన పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయంటున్నాడు ప్రభాస్. అలాఅని బాహుబలి టైపులో ఇది భారీ కథ కాదని, సింపుల్ స్టోరీనే స్క్రీన్ ప్లే ఆధారంగా కొత్తగా చెప్పడానికి ప్రయత్నించామంటున్నాడు.

“సుజీత్ చాలా చక్కగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సన్నివేశాలకే కాకుండా, ఆ సన్నివేశంలో క్యారెక్టర్స్ ఎక్స్ ప్రెషన్ కు కూడా ఓ లింక్ పెట్టి కథ రాసుకున్నాడు. ఇక నా క్యారెక్టర్ విషయానికొస్తే అందులో చాలా లేయర్లు కనిపిస్తాయి. ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలీదు. అలా ఎందుకు చేశాననేది తర్వాత అందరికీ అర్థమౌతుంది.”

దర్శకుడు సుజీత్, సాహో సినిమాను చాలా బాగా తీశాడని మెచ్చుకున్నాడు ప్రభాస్. షూటింగ్ ప్రారంభమైన మొదటి షెడ్యూల్ లోనే, కథకు ఎంతో కీలకమైన సన్నివేశాన్ని తీశాడని, ఆ సన్నివేశం సినిమాలో చాలా చోట్ల వస్తుందని, అలాంటి సీన్ ను మొదటి షెడ్యూల్ లోనే పూర్తిచేశాడని మెచ్చుకున్నాడు. అందరి టెన్షన్ ను సుజీత్ తీసుకుంటే, అతడి టెన్షన్ ను తను తీసుకున్నానంటున్నాడు ప్రభాస్.

ప్రభాస్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..