కేసులను తప్పించుకునేందుకు కోడెల ఎత్తుగడ?

అసెంబ్లీ నుంచి తరలించుకు వెళ్లిన ఫర్నీచర్ ను వెనక్కు ఇవ్వడానికి తను సిద్ధమని, ప్రభుత్వం మనుషులను పంపిస్తే వారిచేత వాటిని తిరిగి పంపించేందుకు తను రెడీగా ఉన్నట్టుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు.…

అసెంబ్లీ నుంచి తరలించుకు వెళ్లిన ఫర్నీచర్ ను వెనక్కు ఇవ్వడానికి తను సిద్ధమని, ప్రభుత్వం మనుషులను పంపిస్తే వారిచేత వాటిని తిరిగి పంపించేందుకు తను రెడీగా ఉన్నట్టుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు!

అయితే ఇదంతా కోడెల కేసులను తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తుగడ అని పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీ నుంచి ఫర్నీచర్ ను తరలించుకు వెళ్లడం ఎంత అక్రమమో వేరే చెప్పనక్కర్లేదు. అలా తరలించుకు వెళ్లిన ఫర్నీచర్ ను కోడెల తన ఆఫీసులకు, తన తనయుడి వ్యాపారాలకు వాడుకున్నారని అధికారులు తేల్చారు. లారీల కొద్దీ ఫర్నీచర్ తరలించారని.. వాటిని కోడెల తనయుడి బైక్ షోరూంలోనూ ఇతర చోట్ల వాడినట్టుగా అధికారులు ప్రకటించారు. అలా అసెంబ్లీ ఫర్నీచర్ ను తమ వ్యాపార అవసరాలకు వాడుకున్నారు.

తీరా ప్రభుత్వం మారడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో కోడెలపై కేసులు కూడా నమోదు అయ్యాయి. ప్రభుత్వాస్తులను ఇలా వ్యక్తిగత అవసరాల నిమిత్తం తరలించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో నష్ట నివారణకు దిగారు కోడెల. తను ఫర్నీచర్ ను వెనక్కు ఇచ్చేస్తానంటూ, వాటిని తీసుకెళ్లాలంటూ ఇలా కోర్టుకు ఎక్కారు.

అయితే ఆ ఫర్నీచర్ ను ప్రభుత్వం ఎలాగూ వెనక్కు తీసుకుంటుంది. కానీ అంతకన్నా ముందు తేలాల్సిన వ్యవహారాలు కొన్ని ఉంటాయి. వాటికి కోడెల వివరణ ఇవ్వాల్సి ఉండవచ్చు. అసెంబ్లీ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఆ ఫర్నీచర్ ను తరలించినట్టుగా అభియోగాలు నమోదు అయ్యాయి. అధికారాన్ని ఉపయోగించుకుని అలాంటి చర్యలకు పాల్పడటం ఎంతవరకూ సబబో కోడెల కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉండవచ్చు.

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..