మెగా హీరోల్లో కొందరికి వున్న సమస్య భారీ శరీరం. అది జీన్స్ వల్ల వచ్చింది. ఏ మాత్రం అశ్రద్ద చేసినా లావుగా అయిపోతారు. పైగా నడుం కింది భాగం, పిరుదుల సంగతి చెప్పనక్కరలేదు. అందువల్ల సదా ఫిట్ గా వుండడానికి ప్రయత్నిస్తూనే వుండాలి.
పవన్ కు మాత్రం ఈ జీన్స్ అంతగా రాలేదు. ఆయన బాడీలో పెద్దగా హెచ్చు తగ్గులు వుండవు. అదో అదృష్టం. కానీ వరుణ్, సాయి ధరమ్ తేజ్ అలా కాదు. వరుణ్ తేజ్ పొడవుగా వుండడం వల్ల కొంత వరకు ఓకె. కానీ సాయి ధరమ్ తేజ్ ఏమాత్రం అశ్రద్ధ చేసినా లావుగా కనిపించేస్తారు.
బ్రో సినిమా పాట ఇటీవల వచ్చింది. పవన్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ కనిపించారు. వాస్తవానికి తేజ్ కన్నా పవన్ నే ఫిట్ గా కనిపించారు. ప్రమాదం జరిగిన తరువాత తేజ్ ఫిజికల్ ఫిట్ నెస్ కోసం భారీ ఎక్సర్ సైజ్ లు చేయడానికి కుదరడం లేదని తెలుస్తోంది. అందువల్ల కూడా ఈ లావు సమస్య వస్తోంది. విరూపాక్ష తో పోల్చుకుంటే బ్రో సాంగ్ లో కొంచెం లావుగానే వున్నారు.
అందువల్ల సాయి ధరమ్ తేజ్ యోగా, కేరళ వైద్యం లాంటి ఆల్టర్ నేటివ్ విధానాలను ఆశ్రయించడం మంచిది అనే సలహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మామూలు నటన సంగతి అలా వుంచితే మెగా హీరోలు అంటే పాటలు, డ్యాన్స్ లు కీలకం. అందుకోసమైన సాయి ధరమ్ జాగ్రత్త పడాల్సి వుంది.