సాయిధరమ్ తేజ్ కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మెగా కాంపౌండ్ హీరోలని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లు కాకుండా, ఎన్టీఆర్ తో సాయితేజ్ కు మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించిన తేజ్, ఇప్పుడు మరోసారి తారక్ తో తనుకున్న ఫ్రెండ్ షిప్ ను బయటపెట్టాడు.
“నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి తారక్ నాకు మంచి ఫ్రెండ్. మా ఇంట్లో వాళ్లు కాకుండా బయట హీరోల నుంచి సపోర్ట్ వచ్చిందంటే అది తారక్ నుంచే. కెరీర్ స్టార్టింగ్ నుంచి నన్ను ఓ మంచి స్నేహితుడిగా చూసేవాడు. ఒరేయ్ తేజుగా, నువ్వు హ్యాపీగా ఉండాలిరా, మంచి సినిమాలు చేయాల్రా అంటూ సపోర్ట్ చేసేవాడు.”
తారక్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా తనను బాగా సపోర్ట్ చేసేవాడని.. ఇద్దరూ తనకు మంచి స్నేహితులని చెప్పుకొచ్చాడు సాయితేజ్. ఇక ప్రేమ-పెళ్లి లాంటి అంశాలపై మరోసారి స్పందించాడు ఈ హీరో. అమ్మాయిలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూ ఫిలాసఫీ బయటపెట్టాడు.
“అందరూ అడిగారని పెళ్లి చేసుకోను. నాకు సెట్ అయినప్పుడు కచ్చితంగా చేసుకుంటాను. ఎప్పటికీ నేను ఆంజనేయ స్వామి భక్తుడినే. అమ్మాయిల విషయలో మనసులో చిన్న కోరిక అయితే ఉంటుంది కానీ వాటిని తట్టుకొని బతుకుతున్నాను. ఆ కోరికను అధిగమించి బతకాలి. అయినప్పటికీ ఓసారి బ్రేకప్ అయింది. చాలా గట్టి దెబ్బ అది. దాంతో అమ్మాయిలంటే భయమేస్తోంది.”
విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు సాయితేజ్. యాక్సిడెంట్ తర్వాత ఈ హీరో నుంచి వస్తున్న సినిమా ఇదే. యాక్సిడెంట్ తర్వాత మాట్లాడ్డానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు తేజ్. మాటల్లో తడబాటు, అస్పష్టత కనిపిస్తోంది. ఈ సమస్య నుంచి త్వరలోనే బయటపడతానంటున్నాడు.