ఎన్టీఆర్ దేవర.. సైఫ్ అలీఖాన్ భైర

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు తారక్. సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు. ఈరోజు అతడి లుక్ తో…

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు తారక్. సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు. ఈరోజు అతడి లుక్ తో పాటు, క్యారెక్టర్ పేరు వెల్లడించారు.

దేవర సినిమాలో భైర అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ ను పోషిస్తున్నాడు సైఫ్ అలీఖాన్. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో గిరజాల జుట్టుతో సీరియస్ గా చూస్తున్న సైఫ్ ఫొటోను విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో ఎత్తైన కొండలు, సముద్రం, పడవలు చూపించారు. సినిమా మొత్తం సముద్రం బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

ఒక ద్వీపం నేపథ్యంలో సెట్ చేసిన కథ దేవర. సముద్రమే ఈ కథకు ప్రధాన ఇతివృత్తం. సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వి కపూర్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా రిలీజైన సైఫ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు సంబంధించిన 3 కీలకమైన లుక్స్ బయటకొచ్చినట్టయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.