Advertisement

Advertisement


Home > Movies - Movie News

సైనికుడికి ప్రేమ లేఖ

సైనికుడికి ప్రేమ లేఖ

అప్పుడేప్పుడో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా వచ్చింది. ముక్కు మొహం తెలియని వాళ్ల నుంచి లేఖ వస్తే గిలగిల లాడిపోయే కుర్రాడి లైఫ్ నుంచి రాబట్టిన ఫన్ లైన్ తో ఆ సినిమా చేసారు. 

ఇప్పుడు లేటెస్ట్ గా సీతారామం అనే సినిమా తయారవుతోంది. దర్శకుడు హను రాఘవపూడి. ప్రేమకథల స్పెషలిస్ట్. భావుకత అంటే ఇష్టం. అందుకే ఈ లేఖాయణాన్ని మరోలా చూపించబోతున్నాడు.

ఒంటరిగా యుద్దంలో వుంటూ, నా అన్నవారు ఎవ్వరూ లేని రామ్ అనే సైనికుడికి తానే అతని భార్య అంటూ ఓ సీతా మహాలక్ష్మి లేఖలు రాయడం ప్రారంభిస్తే...దాని నిండా భావుకత పొంగి పొర్లిపోతూ వుంటే..ఇది చాలక మరో అమ్మాయి కూడా అతని జీవితంలోకి వస్తే...ఇలా కాస్త కొత్తగా ఆలోచించి తయారుచేసినట్లుంది స్వప్న సినిమా నిర్మిస్తున్న 'సీతారామం'

ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు. దుల్కర్ సల్మాన్, మునాల్ ఠాకూర్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ సినిమాకు నిర్మాతలు అశ్వనీదత్, ప్రియాంకదత్, స్వప్నదత్. సంగీతం విశాల్ చంద్రశేఖర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?