శాకుంతల సమంత తీసుకున్నది?

సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆచి తూచి, ఎంచుకుని మరీ ప్రాజెక్టులు చేస్తోంది. ఓ బేబీ తరువాత ఫ్యామిలీమన్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసిన సమంత లేటెస్ట్ గా ఓకె చేసిన ప్రాజెక్టు…

సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆచి తూచి, ఎంచుకుని మరీ ప్రాజెక్టులు చేస్తోంది. ఓ బేబీ తరువాత ఫ్యామిలీమన్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసిన సమంత లేటెస్ట్ గా ఓకె చేసిన ప్రాజెక్టు శాకుంతలం. గుణశేఖర్ డైరక్షన్ లో దిల్ రాజు భాగస్వామ్యంలో నిర్మాణమవుతున్న సినిమా. ఈ సినిమాకు సమంతనే కీలకం. 

గుణశేఖర్ కొంతమందిని అప్రోచ్ అయినా ఎవ్వరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ దిల్ రాజు ప్రాజెక్టులోకి ఎంటర్ కావడంతో, సమంత రావడం అన్నది పాజిబుల్ అయింది.అయితే తన పాత్రే కీలకంగా తయారవుతున్న శాకుంతలం సినిమాకు సమంత ఎంత చార్జ్ చేసి వుంటుందన్నది క్వశ్చను.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమాకు సమంత 2.50 కోట్లు తీసుకుంటోంది. వాస్తవానికి ఇది యాభై లక్షలు తక్కువే. ఎందుకంటే సమంత-నందినీరెడ్డి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు ప్లానింగ్ లో వుంది. దానికి మూడు కోట్ల రెమ్యూనిరేషన్ కోట్ చేసి,అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేసింది సమంత. ఆ ప్రాజెక్టు 2022 లో వుంటుంది. 

కానీ శాకుంతలం ప్రాజెక్టు మీద ఆసక్తితో యాభై లక్షలు తగ్గించి 2.50 కోట్లు మాత్రమే తీసుకోవడానికి ఓకె చేసింది.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్