Advertisement

Advertisement


Home > Movies - Movie News

బుల్లితెరపైకి బ్లాక్ బస్టర్లు.. డేట్స్ ఫిక్స్

బుల్లితెరపైకి బ్లాక్ బస్టర్లు.. డేట్స్ ఫిక్స్

వారం గ్యాప్ లో రెండు బ్లాక్ బస్టర్లు బుల్లితెరపైకి రాబోతున్నాయి. వీటిలో ఓ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరో సినిమా కోసం మాస్-యూత్ కళ్లుకాయలు కాచేలా చూస్తోంది. వీళ్లలో మాస్ ప్రేక్షకులు, యూత్ నిరీక్షణ ముందుగా ఫలించబోతోంది.

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా టీవీల్లోకి రాబోతోంది. ఈ ఆదివారమే ఈ సినిమా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డలు నమోదు చేస్తుందో చూడాలి.

ప్రభాస్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. మరికొన్ని రోజుల్లో పార్ట్-2 సెట్స్ పైకి రాబోతోంది. ఇలాంటి టైమ్ లో టీవీల్లోకి వస్తున్న సలార్ సినిమా, సీక్వెల్ పై అంచనాల్ని మరింత పెంచుతోంది.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజైంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల కోసం సిద్ధమైంది.

ఈ సినిమా డిజిటల్-శాటిలైట్ హక్కుల్ని జీ తెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని 28వ తేదీన జీ తెలుగులో ప్రసారం చేయబోతోంది. ఈ సినిమాలు రెండూ ఇప్పటికే ఓటీటీలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు వారం గ్యాప్ లో టీవీల్లో కూడా సత్తా చాటబోతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?