పుకార్లు నిజమయ్యాయి.. సలార్ వస్తున్నాడు

అన్నీ అనుకున్నట్టు జరిగితే లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలో ఉండాలి సలార్. కానీ నిన్న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీనిపై హోంబలే ఫిలిమ్స్ పై నిన్నంతా ఓ రేంజ్ లో ట్రోలింగ్…

అన్నీ అనుకున్నట్టు జరిగితే లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలో ఉండాలి సలార్. కానీ నిన్న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీనిపై హోంబలే ఫిలిమ్స్ పై నిన్నంతా ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే.ఇప్పుడీ సినిమాకు వెంటనే మరో విడుదల తేదీ ప్రకటించారు. సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది.

ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేస్తున్నారనే ఊహాగానాలు దాదాపు వారం రోజులుగా నడిచాయి. మేకర్స్ కావాలనే ఈ ఫీలర్లను వదిలారు. అలా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా, ఇప్పుడు ఇదే తేదీని అధికారికంగా లాక్ చేశారు. సలార్ – సీజ్ ఫైర్ డిసెంబర్ 22న వస్తోందనే న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా దర్శకుడైన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో, సలార్ పై భారీ అంచనాలున్నాయి. గమ్మత్తుగా ఇది కూడా ఫ్రాంచైజీనే.

రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్ భయంకరంగా ఉంది. ఒంటి నిండా రక్తంతో తడిసిముద్దయిన ప్రభాస్ ఫొటోను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే యాక్షన్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు.