పొద్దున్నే సలార్ టీజర్ రిలీజైంది. చాలామంది అలారం పెట్టుకొని మరీ ఉదయాన్నే 5 గంటలకు లేచారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రాత్రంతా నిద్రపోలేదు. ఇంత హంగామా, హడావిడి మధ్య రిలీజైన సలార్ టీజర్ అద్భుతంగా ఉందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. టీజర్ తో పండగ చేసుకుంటున్నారు. అయితే వాళ్లు నిజంగానే సెలబ్రేట్ చేసుకునేంత స్థాయిలో టీజర్ ఉందా?
సలార్ టీజర్ పై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే, అసలిది టీజర్ కాదంట. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ చూడ్డానికి గ్లింప్స్ లా ఉంది తప్ప టీజర్ లా లేదనేది చాలామంది ఆరోపణ. దీనికి వాళ్లు చెప్పే లాజిక్ కూడా లాజికల్ గానే ఉంది. సాధారణంగా గ్లింప్స్ లో హీరో ముఖం చూపించరు. ఫటాఫట్ ఫ్రేమ్స్ మారిపోతుంటాయి, చివర్లో టైటిల్ లేదా రిలీజ్ డేట్ పడుతుంది.
ఈరోజు రిలీజైన సలార్ టీజర్ కూడా అలానే ఉందంటున్నారు. టీజర్ లో ఎక్కడా ప్రభాస్ ముఖం కనిపించలేదు. అలాంటప్పుడు ఇది టీజర్ ఎలా అవుతుందనేది చాలామంది ప్రశ్న.
సలార్ టీజర్ పై మరో విమర్శ, ఇది కేజీఎఫ్-3 లా ఉందనేది. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలకు ప్రశాంత్ నీల్ ఎలాంటి ఫార్మాట్స్, కలర్ ప్యాలెట్స్, లైటింగ్ ఫాలో అయ్యాడో.. అవన్నీ యాజ్ ఇటీజ్ గా సలార్ టీజర్ లో కనిపించాయి. దీంతో ఫ్రేమ్స్ లో కొత్తదనం లేదనేవారు కూడా ఉన్నారు.
మరికొంతమంది సాహో టీజర్, ట్రయిలర్ తో కంపేరిజన్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా టీజర్ కంటే, సలార్ టీజర్ ఏమంత గొప్పగా లేదంటూ పెదవి విరుస్తున్నారు. ఇక సలార్ ను కంటెంట్ మాత్రమే కాపాడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే సలార్ కాస్తా, బాక్సాఫీస్ డైనోసార్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు.
అయితే నెగెటివ్ కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ సినిమాపై క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. ఆ క్రేజ్ సినిమా రిలీజ్ వరకు కొనసాగుతుంటుంది. ఇప్పుడీ క్రేజ్ కు ప్రశాంత్ నీల్ కూడా తోడయ్యాడు కాబట్టి.. ఇలాంటి కామెంట్స్ ను యూనిట్ పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎటొచ్చి టీజర్ లో ప్రభాస్ కటౌట్ ను చూపించి ఉంటే సరిపోయేది. అదొక్కటే వెలితి.