సలార్..రెండు భాగాలు ఫిక్స్

బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ ను తొలిచేస్తున్న ప్రశ్న..సలార్ సినిమా రెండు భాగాలా లేక ఒక భాగమేనా? ఇదే ప్రశ్నను ప్రభాస్ కు నేరుగా సంధిస్తే..ఆయన చిరునవ్వుతో తప్పించుకున్నారు. అవన్నీ తరువాత. ముందు రాధేశ్యామ్ అంటూ…

బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ ను తొలిచేస్తున్న ప్రశ్న..సలార్ సినిమా రెండు భాగాలా లేక ఒక భాగమేనా? ఇదే ప్రశ్నను ప్రభాస్ కు నేరుగా సంధిస్తే..ఆయన చిరునవ్వుతో తప్పించుకున్నారు. అవన్నీ తరువాత. ముందు రాధేశ్యామ్ అంటూ వదిలేసారు. 

నిజంగా ఒక భాగమే అయితే అవన్నీ రూమర్లే అని కొట్టి పారేసి వుండేవారు. కానీ అలా చేయలేదు అంటే రెండు భాగాలే అని, ఇప్పట్లో ఆ విషయం చెప్పడానికి ఇష్టపడడం లేదని అర్థం అవుతోంది.అలాగే త్వరలో కామెడీ సినిమా ఒకటి చేయబోతున్నా అని ప్రభాస్ వెల్లడించారు. అయితే అది దర్శకుడు మారుతి సినిమా అని మాత్రం ఆయన చెప్పలేదు.

నో పూజా

ప్రభాస్ తన ప్రసంగంలో చాలా మంది గురించి మాట్లాడారు కానీ హీరోయిన్ పూజా హెగ్డే గురించి పొరపాటున కూడా ప్రస్తావించలేదు. ప్రభాస్ కు పూజాకు మధ్య ఏదో తేడా వచ్చిందని గుసగుసలు వున్నాయి. 

గత వారం రోజులుగా ఇద్దరూ కలిసి ప్రమోషన్ చేస్తున్నారు కానీ ఎడమొహం పెడమొహంగానే వున్నారు. ఇప్పుడు కూడా అందరి గురించి ప్రస్తావించినా పూజా గురించి మాత్రం మాట్లాడలేదు. దర్శకుడు రాధాకృష్ణ మాత్రం పూజా గురించి, ఆమె పాత్ర గురించి మాట్లాడారు.

థమన్ చూపేవేరు

ధమన్ వచ్చిన తరువాత రాధేశ్యామ్ విషయంలో ఆలోచన మారిపోయిందన్నారు ప్రభాస్. తాము అంతా రాధేశ్యామ్ సినిమాను ఓ విధంగా చూస్తే థమన్ వేరే విధంగా చూసారని ఆయన అన్నారు. 

థమన్ రావడం సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లిందన్నారు. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ డిటైలింగ్ తనకు నచ్చుతుందని, ఛత్రపతి నుంచి కలిసి పని చేస్తున్నామని ప్రభాస్ అన్నారు.