ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ల సలార్ సినిమా ఓవర్ సీస్ డీల్ క్లోజ్ అయింది. సెప్టెంబర్ 28 న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను ఫారస్ ఫిలింస్ కు ఇచ్చారు. అయితే ఇది కొనుగోలు డీల్ కాదు. అలా అని డిస్ట్రిబ్యూషన్ డీల్ కాదు.
నిర్మాత తరపున ఓవర్ సీస్ లో బిజినెస్ చేసి, ఎప్పటి అమౌంట్ అప్పుడు ముందుగానే అందించే డీల్. దీని వల్ల ఫారస్ ఫిలింస్ కు కమిషన్ ముడుతుంది. కానీ వడ్డీ లేని మొత్తాలు ఎప్పటికి అప్పుడు పెట్టుబడి పెట్టాలి. నిర్మాతకు అడ్వాన్స్ మాదిరిగా కాకుండా బిజినెస్ బేస్డ్ గా అమౌంట్ అందుతుంది. ఎంత బిజినెస్ అవుతుందన్నది ఇద్దరికీ క్లారిటీ వుంటుంది.
ఇలాంటి కొత్త తరహా డీల్ ను ఇప్పుడు తొలిసారి సలార్ సినిమాతో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విధమైన డీల్ తో మైత్రీ మూవీస్ నుంచి పుష్ప 2 సినిమాను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి డీల్ వల్ల నిర్మాతకు పెద్దగా ఇబ్బంది వుండదు. బయ్యర్ కు ముందే భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టే పని వుండదు. పుష్ప2 కనీసం 65 నుంచి 70 కొట్ల రేంజ్ వుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని విడతలు విడతలుగా పే చేసే అవకాశం వుంటుంది. రిస్క్ తగ్గుతుంది.లాభం కూడా తగ్గి జస్ట్ కమిషన్ వస్తుంది.
ప్రస్తుతానికి ఈ కొత్త తరహా డీల్ గురించి తెలుస్తున్న సంగతి ఇదే. ప్రస్తుతానికి ఓవర్ సీస్ లో బయ్యర్లు తగ్గారు. ఫారస్ పిలింస్ నే భారీ మొత్తాలు ఎదురు పెట్టుబడి పెట్టి దాదాపు అన్ని సినిమాలు చేతిలోకి తీసుకుంటోంది. ఖుషీ, రావణాసుర సినిమాలు కూడా ఈ సంస్థే ఓవర్ సీస్ హక్కులు తీసుకుంది.