బాలీవుడ్ లో బాబా సిద్ధిఖ్ హత్యానంతర వేడి కొనసాగుతూ ఉంది. బాబా సిద్ధిఖ్ ను ముందుగా డబ్బులు అడిగారని, అయితే ఆయన నిరాకరించడంలో కాల్చి చంపారనే ప్రచారం జరుగుతూ ఉంది. కేవలం సల్మాన్ తో సాన్నిహిత్యం ఫలితంగానే సిద్ధిఖ్ హత్య జరిగి ఉండకపోవచ్చని.. డబ్బుల వ్యవహారం కూడా ఉండవచ్చనే అనుమానాలే సాధారణంగా వ్యక్తం అవుతాయి. అయితే పోలీసులు ఇందుకు సంబంధించి ఏం ప్రకటించలేదు.
అయితే సల్మాన్ కు హెచ్చరికలు అయితే వచ్చాయని పోలీసులే చెబుతున్నారు. ఐదు కోట్ల రూపాయల మేర చెల్లించకపోతే సల్మాన్ కు సిద్ధిఖ్ పరిస్థితే అంటూ హెచ్చరికలు వచ్చాయట. అయితే వాటి మూలాలను చేధించే పనిలో ఉన్నారు పోలీసులు. అవి ఎవరో అనామకులు జారీ చేసినవే అని తేలినట్టుగా ఉంది.
ఆ సంగతలా ఉంటే.. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక డబ్బు ప్రమేయం లేదని అంటున్నాడు లారెన్స్ బిష్ణోయ్ కజిన్ ఒకడు. లారెన్స్ తరఫున మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్ తో బిష్ణోయ్ గ్యాంగ్ డబ్బు డిమాండ్ చేయడం లేదన్నాడు. చాలా యేళ్ల కిందటే సల్మాన్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెక్ కాదు, చెక్ బుక్ నే ఆఫర్ చేశాడట! ఒక చెక్ కాకుండా, మొత్తం బుక్ ఇచ్చి ఎంత రాసుకుంటారో రాసుకోవచ్చని సల్మాన్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. అయితే బిష్ణోయ్ గ్యాంగ్ ఆ ప్రపోజల్ ను తిరస్కరించిందని లారెన్స్ కజిన్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు సల్మాన్ ను డబ్బు కోసమే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలను బిష్ణోయ్ గ్యాంగ్ ఇలా ఖండించే పనిలో పడింది. కృష్ణ జింకలను వేటాడిన వ్యవహారంలో తమకు రక్తం మరిగిందని, అందుకే సల్మాన్ టార్గెట్ అయ్యాడని .. ఆర్థిక పరిహారంతో తమను చల్లబరచలేరన్నట్టుగా లారెన్స్ కజిన్ చెప్పుకొచ్చాడు!
మొత్తానికి వారానికి 50 విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తే పట్టించుకోరు. అదే ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చునే సలీమాన్ భాయ్ కి బెదిరింపులొస్తే PMO నుండి ఆదేశాలు వస్తాయి.
Pattinchukonidhi raashtra prabhutvamaa, Kendra prabhuthvamaa, edaithe adhi maarcheyalantaara
Tokkaloni Bhishnoi gang… BJP anda lekunda veellu bataka leru
Bishnoi community is separate, it is not a bjp group.
vc available 9380537747
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
Ore vedava, గుడి మెట్లమీద కుర్చుని బిచ్చం ఎత్తుకో