ఈ మధ్యకాలంలో సీక్వెల్ అంటేనే జనాలు దడుచుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి సూపర్ హిట్ అయిన ఒకప్పటి సినిమాలకు సీక్వెల్ అంటే.. దాన్ని కేవలం మార్కెట్ చేసుకునే వ్యూహంగా పరిగణించే పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే కొత్త సినిమాలు ఏవి అనౌన్స్ అయినా.. ఒకటీ రెండు మూడు పార్ట్ లు అంటూ ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తం కథ చెప్పకుండా, మూడు గంటల సేపు కూర్చోబెట్టి కూడా పెండింగ్ పెడుతున్నారు. ఇలాంటి సీక్వెల్స్ పట్లే ప్రేక్షకాదరణ తగ్గిపోతూ ఉంది. ఒక భాగంపై ఉన్నంత ఆసక్తి మరో భాగంపై ఉంటుందనే రుజువులు లేవు. ఎంతసేపూ బాహుబలి రిఫరెన్స్ సరిపోదు!
అదలా ఉంటే.. ఇప్పుడు గజిని సీక్వెల్ అనే టాక్ వస్తోంది. ఇటు సౌత్ వెర్షన్, అటు నార్త్ వెర్షన్ గజిని 2 లకు ప్రయత్నాలు మొదలుపెట్టారట హిందీ గజిని నిర్మాత అల్లు అరవింద్. తమిళంలో హిట్ అయిన గజినిని హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అరవింద్, మధు మంతెన, అమీర్ ఖాన్ లు సీక్వెల్ ఆలోచన చేస్తున్నారట. ఆమిర్ ఒప్పుకుంటే ఒకే సమయంలో.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తీస్తారట. హిందీ వెర్షన్ ఆమిర్, తమిళ; తెలుగుల్లో సూర్య ఈ సినిమాలో నటిస్తారట! యథారీతిన మురుగదాసే దర్శకత్వం వహిస్తారని అనుకోవాలి!
అయితే గజిని ఆడిన రోజులు కావివి! అప్పుడు హాలీవుడ్ సినిమాల స్పూర్తితో సినిమాలు తీస్తే నడిచాయి. అయితే ఇప్పుడు పాత సినిమాలనే పోలికలు పెట్టి జనాలు ఆడుకుంటున్నారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ట్రోల్ భారీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో భారతీయుడు పార్ట్ టూ అంటూ బెదరగొట్టారు. దానికి మూడో పార్ట్ ను థియేటర్ విడుదల సాహసం కూడా లేదట! ఓటీటీ విడుదల ప్రయత్నాలు సాగుతున్నాయట.
అయితే ఇలాంటి వాటికి అతీతంగా పాత మ్యాజిక్ ను రిపీట్ చేసే కాన్ఫిడెన్స్ తో అల్లు అరవింద్ ఉన్నారేమో! ఆమిర్ ఓకే అంటే, సూర్యను ఓకే చేసుకుని సీక్వెల్ కథారచనకు శ్రీకారం చుడతారట!
ఘజిని verse అని అన్ని భాషల్లో ఈ మతిమరుపు వెధవల్ని ఒక చోటకి చేర్చి, వారికి పుట్టే సంతానానికి కూడా ఇలాంటి వ్యాధిని ఆపాదిస్తే ఒకరిని ఒకరు కొట్టుకొని చస్తారు…దరిద్రం వదిలిపోతుంది.
Correct sir
అట్టా చెప్పే భారతీయుడు 2 అని మా మొఖాన కొట్టారు.. తాత వచ్చాడు, బెదరగొట్టి పోయాడు
vc estanu 9380537747
Call boy works 9989793850
Continue cheyadaniki story yem ledu …ee sari gajani revange audience mida kabolu…
సీక్వెల్ తీసినా థియేటర్ లో చూడం
Ghajini Amir khan