సమంత..చైతూ..ఏమైనా చెబుతారా?

గత కొన్నాళ్లుగా వార్తల్లో, గ్యాసిప్ ల్లో వినిపిస్తున్న జంట…చైతూ-సమంత. నిజానిజాలు వారికీ, వారి కుటుంబ సభ్యులకే తెలియాలి. కానీ గ్యాసిప్ లు మాత్రం ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. దీనికి తగినట్లే సమంత సోషల్…

గత కొన్నాళ్లుగా వార్తల్లో, గ్యాసిప్ ల్లో వినిపిస్తున్న జంట…చైతూ-సమంత. నిజానిజాలు వారికీ, వారి కుటుంబ సభ్యులకే తెలియాలి. కానీ గ్యాసిప్ లు మాత్రం ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. దీనికి తగినట్లే సమంత సోషల్ మీడియా పోస్ట్ లు కూడా వుంటున్నాయి. 

గమ్మత్తేమిటంటే రెండు రోజుల క్రితం సమంత లేదా ఆమె తరపు వారు ఓ వార్తను రాయించి ప్రచారం చేసారు. సమంత సోషల్ మీడియాలో చెప్పిన సమాధానాలు ఆధారంగా ఆ వార్తను తయారుచేసి, దానంతట అది వచ్చినట్లు చేసారు. నిజానికి దాని వెనుక సమంత టీమ్ వుందన్నది మీడియాకు తెలిసిన రహస్యం.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే, సమంత త్వరలో పిల్లలను కనబోవడానికి ఆసక్తిగా వుందని. మరి కానీ అదే సమయంలో వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే…చైతన్య ప్రస్తుతం ఐటిసి కోహినూర్ హోటల్ ను తన బసగా మార్చుకున్నారని. ఆయన ఇంటికి వెళ్లకుండా అక్కడే వుంటున్నారని. అలాగే ఆయన..సమంత కలిసి తయారుచేసుకున్న డ్యూప్లెక్స్ పెంట్ హవుస్ ప్లాట్ లో సమంత వుంటున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు సమంత నుంచి ఓ వార్త ఓపెన్ గా బయటకు రాబోతోందన్న గ్యాసిప్ లు గుప్పు మన్నాయి. అది పాజిటివ్ నా నెగిటివ్ నా? ఈ గ్యాసిప్ లు అన్నింటికి సమాధానమా అన్నది మాత్రం తెలియదు. వెయిట్ అండ్ సీ.