Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరీ ఓవర్ చేస్తున్న సమంత ఫ్యాన్స్

మరీ ఓవర్ చేస్తున్న సమంత ఫ్యాన్స్

సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సహజంగా హీరో ఫొటోనే ఉంటుంది. ఈమధ్య కాస్త పద్ధతి మారింది కానీ, లేకపోతే టీజర్ లో కూడా ఆసాంతం హీరోనే కనిపించేవాడు. ఇది అత్యంత సహజమైన విషయం. ఎందుకంటే హీరోనే క్రౌడ్ పుల్లర్. ఈ చిన్న లాజిక్ ను కూడా మిస్ అవుతున్నారు సమంత ఫ్యాన్స్. సోషల్ మీడియాలో లేనిపోని యాగీ చేస్తున్నారు.

శర్వానంద్-సమంత హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వచ్చిన 96 మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు తెలుగులో జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిన్ననే టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో ఎడారిలో ఒంటెలతో శర్వానంద్ ఉన్న స్టిల్ ఉంది. సరిగ్గా ఇక్కడే సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

జాను సినిమా టైటిల్ పోస్టర్ లో సమంతకు ఎందుకు స్థానం కల్పించలేదనేది వీళ్ల ప్రశ్న. ఈ సినిమాలో సమంత పాత్ర పేరు జాను. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే ఆమె క్యారెక్టర్ పేరునే టైటిల్ గా కూడా పెట్టారు. అలాంటప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా సమంత ఫొటో ఉండాలి కదా అనేది ఆమె అభిమానుల డిమాండ్.

సమంత క్రేజ్ కూడా శర్వానంద్ కు ఏమాత్రం తీసిపోదంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఓ బేబీ సినిమాతో ఆమె సోలోగా హిట్ కొట్టిందని, ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా ఎంటరైందంటూ లెక్కలు తీస్తున్నారు. అది నిజమే. సమంతకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉందనేది వాస్తవం. కానీ అంత మాత్రానికే ఫస్ట్ లుక్ లో కూడా ఆమె ఫొటో పెట్టాలని డిమాండ్ చేయడం మాత్రం చాలా సిల్లీ.

రష్మిక ఉతికి ఆరేసింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?