విడాకుల తర్వాత చనిపోవాలనుకున్న సమంత!

నాగచైతన్యతో విడాకులపై మరోసారి స్పందించింది సమంత. ఈసారి తన వ్యక్తిత్వానికి లింక్ చేస్తూ, విడాకుల వ్యవహారంపై రియాక్ట్ అయింది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత తను ఎంత బలవంతురాలినో అర్థమైందని ప్రకటించింది సమంత. Advertisement…

నాగచైతన్యతో విడాకులపై మరోసారి స్పందించింది సమంత. ఈసారి తన వ్యక్తిత్వానికి లింక్ చేస్తూ, విడాకుల వ్యవహారంపై రియాక్ట్ అయింది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత తను ఎంత బలవంతురాలినో అర్థమైందని ప్రకటించింది సమంత.

“సమస్య ఉందని ముందుగా అంగీకరించాలి. దాంతో ఫైట్ చేయాలి. నా వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నిజానికి నేను చాలా బలహీనురాల్ని అనుకునేదాన్ని. కానీ నేను ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడిన తర్వాత నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయాను. నా భర్త నుంచి విడిపోయిన తర్వాత చాలా భయపడ్డాను, చనిపోతానేమో అనుకున్నాను. ఆ ఘటన నుంచి బయటపడలేనేమో అనుకున్నాను. కానీ నేను సక్సెస్ ఫుల్ గా బయటపడ్డాను. నేను చాలా స్ట్రాంగ్ అనే విషయం అప్పుడు నాకు తెలిసొచ్చింది.”

నాగచైతన్యతో విడిపోయిన అంశం తనను ఎంతగానో బాధించిందనే విషయాన్ని సమంత ఇలా బయటపెట్టింది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో స్ట్రాంగ్ గానే ఉంటారని, సరైన సమయం వచ్చినప్పుడు ఆ శక్తి బయటపడుతుందని వెల్లడించింది. బాధనైనా, సంతోషాన్నైనా ఒకేలా తీసుకోవాలని అంటోంది.

“నేను ఏదైనా అందరితో పంచుకుంటాను. సోషల్ మీడియాలో సంతోషాన్ని మాత్రమే కాదు, బాధను కూడా పంచేస్తాను. దాని వల్ల మన మనసులో బాధ చాలా తగ్గిపోతుంది. నన్ను బాధపెట్టిన చాలా అంశాలపై నేను సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాను.”

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్ కు, అల్లు అర్జున్ వేస్తున్న స్టెప్పులకు సింక్ అయ్యేలా డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉందని అంటోంది.