నిర్మాతగా తాప్సి.. హీరోయిన్ గా సమంత?

ఆమధ్య కాజల్-తమన్న జోడీ తెరపైకొచ్చింది. ఓ బ్యానర్ పెట్టే ఆలోచన చేసింది కాజల్. తను నిర్మాతగా, తమన్న లీడ్ రోల్ లో ఓ సినిమా చేయాలనుకుంది. కానీ అంతలోనే ఆ ప్రపోజల్ అటకెక్కింది. పెళ్లి…

ఆమధ్య కాజల్-తమన్న జోడీ తెరపైకొచ్చింది. ఓ బ్యానర్ పెట్టే ఆలోచన చేసింది కాజల్. తను నిర్మాతగా, తమన్న లీడ్ రోల్ లో ఓ సినిమా చేయాలనుకుంది. కానీ అంతలోనే ఆ ప్రపోజల్ అటకెక్కింది. పెళ్లి తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది కాజల్. ఇప్పుడు ఇలాంటిదే మరో జోడీ తెరపైకొచ్చింది. ఈసారి సమంత-తాప్సి.

కాజల్-తమన్నలా.. తాప్సి-సమంత కూడా మంచి ఫ్రెండ్స్. ఈ ఏడాది కొత్తగా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసింది తాప్సి. దాని పేరు ఔట్ సైడర్ ఫిలిమ్స్. ఈ బ్యానర్ పై తనే నిర్మాతగా, హీరోయిన్ గా బ్లర్ అనే సినిమా చేస్తోంది తాప్సి. ఈ మూవీ తర్వాత సమంత లీడ్ రోల్ లో తన సెకెండ్ వెంచర్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది తాప్సి.

మంచి కథలు సెట్ అయితే బాలీవుడ్ లో సినిమాలు చేసే ఆలోచనలో ఉంది సమంత. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ వేషాలు చేసి, ఫ్యామిలీమేన్ తో వచ్చిన ఇమేజ్ ను చెడగొట్టుకోవాలని ఆమెకు లేదు. అందుకే కాస్త లేట్ అయినా, మంచి రోల్స్ కోసం వెయిట్ చేస్తోంది.

ఇందులో భాగంగా తాప్సి బ్యానర్ పై ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాను హిందీతో పాటు, తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని అనుకుంటున్నారు.