పూర్వం ప్రేమ సందేశాలు పంపించడానికి మేఘాలు, పావురాలు, ఆపై ప్రేమ లేఖలు వుండేవి. ఇప్పుడు అంతా వాట్సాప్, ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ కాలం. గూగుల్ నిండా కోట్ల కొద్దీ కొటేషన్లు. అనేక ప్లాట్ ఫారమ్ ల్లో మాంచి పాటలు, డైలాగుల బిట్లు. ఇలా ఎన్నో మార్గాలు వచ్చేసాయి. మన మనసులో మాటలు అవతలి వారికి మాత్రమే కన్వే అయ్యేలా, ఛూజ్ చేసుకుని వాడేసుకోవచ్చు.
హీరోయిన్ సమంత లేటెస్ట్ గా ఇన్ స్టా స్టేటస్ ల్లో పెట్టిన బోలెడు మెసేజ్ కార్డులు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఆమె తన మనసులో మాటలు తన భర్త చైతన్యకు కన్వే చేయడానికి ఈ విధంగా ప్రయతిస్తోందా? అన్న అనుమానం కలుగుతోంది.
నువ్వు నన్ను బాధపెట్టి వుండొచ్చు..నేను నిన్ను బాధ పెట్టి వుండొచ్చు. ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. మొత్తానికి రియాల్టీ ఇదే…వసంతం కావాలంటే శిశిరాన్ని కూడా అనుభవించాలి. ఇలా రకరకాల కోట్ లు పోస్ట్ చేసింది సమంత.
నిజానికి మామూలుగా అయితే వీటిని పట్టించుకోరు కానీ చైతన్య-సమంతల మధ్య ఏదో నడుస్తోంది అన్న టాక్ వుండడంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది. వీటి ద్వారా సమంత తన వాదనను చైతన్యకు కన్వే చేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కానీ ఒకటే అనుమానం. ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఎందుకు చేయడం. పర్సనల్ మెసేజ్ లు పంపుకోవచ్చు కదా?