నిజంగా సమంత పరువు తీసే పుకారు ఇది!

ఆమెకు ఆల్రెడీ క్రేజ్ ఉంది. ఆమె సినిమా చేస్తానంటే నో చెప్పే హీరో ఉండడు. ఆమె స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడానికే అంతా ప్రయత్నిస్తారు. అలాంటి సమంత ఓ సినిమాలో గెస్ట్ రోల్…

ఆమెకు ఆల్రెడీ క్రేజ్ ఉంది. ఆమె సినిమా చేస్తానంటే నో చెప్పే హీరో ఉండడు. ఆమె స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడానికే అంతా ప్రయత్నిస్తారు. అలాంటి సమంత ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుందా? సెకెండ్ హీరోయిన్ గా నటిస్తుందా? దసరా అనే సినిమాకు సంబంధించి ఇలాంటి పుకార్లే వచ్చాయి. నిజంగా సమంత పరువు తీసే పుకారు ఇది.

నాని హీరోగా దసరా టైటిల్ తో ఈమధ్య కొత్త సినిమా ప్రకటించారు. ఆ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడే హీరోయిన్ గా కీర్తిసురేష్ పేరు కూడా ప్రకటించారు. అంతలోనే ఈ ప్రాజెక్టులోకి సమంత వస్తోందంటూ పుకార్లు అల్లేశారు. కీర్తిసురేష్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న తర్వాత, మరో పాత్రలో సమంత నటిస్తుందా? ఈ చిన్న లాజిక్ కూడా మరిచిపోయి కథనాలు వండివార్చేశారు. బహుశా మహానటి సినిమాలో ఇద్దరూ నటించారనే ఉద్దేశంతో ఈ పుకారు పుట్టించి ఉంటారు. 

గోదావరి ఖని బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో వస్తున్న దసరా సినిమాలో ఓ కీలక పాత్ర ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ చిన్న పాత్ర కోసం సమంతను తీసుకోవాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆ ప్రత్యేక పాత్ర పోషించే హీరోయిన్ పేరును ప్రకటిస్తారు. ఐశ్వర్య రాజేశ్, నివేత పెతురాజ్ రేంజ్ హీరోయిన్ అయితే సరిపోతుందనేది యూనిట్ టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా నిర్మాణరంగంలోకి ఎంటరైన జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే రిపబ్లిక్, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరించిన ఈ సంస్థ.. నాని సినిమాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. అటు అమెజాన్ సంస్థ కూడా డిజిటల్ రైట్స్ కోసం మంచి ఆఫర్ ఇచ్చింది.