విజయ్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన సమంత

ఖుషి.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా. ఫస్ట్ టైమ్ అతడి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. దీనికి కారణం సమంత. Advertisement…

ఖుషి.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా. ఫస్ట్ టైమ్ అతడి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. దీనికి కారణం సమంత.

తీవ్రంగా అనారోగ్యం పాలైన సమంత కెమెరాకు దూరమైంది. దీంతో ఆమె ఎప్పుడు కోలుకొని, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని విజయ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూడసాగారు.

మొత్తానికి సమంత కోలుకుంది. ఇక సెట్స్ పైకి రావడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో విజయ్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది. కోలుకున్న తర్వాత ఆమె ఖుషి సినిమా స్టార్ట్ చేయలేదు. సరికదా, అమెజాన్ కు కమిటైన ఓ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయింది. ఇవాళ్టి నుంచి ఆ సిరీస్ షూట్ కూడా మొదలైంది.

తను మళ్లీ సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని సమంత వెల్లడించింది. తన కొత్త వెబ్ సిరీస్ లుక్ ను కూడా రివీల్ చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. మరి 'ఖుషి సంగతేంటి' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు సమంత వెంటనే రియాక్ట్ అయింది. ఖుషి సినిమా షూటింగ్ లేట్ అవుతున్నందుకు ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన సమంత, త్వరలోనే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపింది.

ఆ వెంటనే విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అయ్యాడు. సమంత పునరాగమనం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ చేశాడు.

కొన్ని రోజుల కిందట ఖుషి దర్శకుడు శివ నిర్వాణ స్పందించాడు. అతి త్వరలోనే సెట్స్ పైకి వస్తామంటూ ప్రకటించాడు. ఇప్పుడు సమంత కూడా డేట్ చెప్పకుండా 'అతి త్వరలో' అంటూ ముగించింది.