విజయ్ దేవరకొండ-రష్మిక అంటే ఫ్యాన్స్ కు క్రేజీ జంట. డియర్ కామ్రేడ్ తరువాత ఈ జంట మళ్లీ కలిసి తెర మీద కనిపించలేదు. ఇద్దరూ మంచి స్నేహితులే అయినా ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఇద్దరినీ మళ్లీ మరోసారి జంటగా తెరమీదకు తీసుకువచ్చే ఆలోచనలు సాగుతున్నాయి. ఇద్దరు నిర్మాతలు ఈ ఆలోచన చేస్తున్నారు. గీత గోవిందం నిర్మించిన బన్నీ వాస్ మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటున్నారు. అదే టోటల్ టీమ్ తో గీత గోవిందం సీక్వెల్ ప్లాన్ చేయాలన్నది ఆలోచన. ఈ మేరకు కథ వండుతున్నారు. డిస్కషన్లు సాగుతున్నాయి.
ఇదిలా వుంటే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో మరో సినిమా సెట్ మీదకు వెళ్లడానికి సిద్దంగా వుంది సితార సంస్థ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. రష్మిక అయితే ఎలా వుంటుంది అనే ఆలోచన అక్కడా వుంది. అయితే దానికి హీరో విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి వుంది.
దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏ విషయం ఫిక్స్ చేస్తారని ఆగారు. ఒకటి రెండు రోజుల్లో రష్మిక వుంటుందా? వేరే హీరోయిన్ నా? అన్నది ఫైనల్ అవుతుంది. సమంత-విజయ్ సినిమా ఖుషీ సినిమా ప్రస్తుతం సెట్ మీద వుంది. దాని తరువాతే ఈ సినిమా వుంటుంది.