వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు చూసింది. సినిమాల్లో ఫ్లాపులు చూసింది. అనారోగ్యాన్ని కూడా ఎదుర్కొంది. ఇలా జీవితంలో ఎన్నో చూసింది సమంత. ఇప్పుడీ హీరోయిన్ సంతోషంగా ఉన్నట్టు తెలిపింది. తన జీవితంలో కొత్త ఛాప్టర్ మొదలైనట్టు ఉందని అంటోంది.
“ప్రస్తుతం నా జీవితంలో కొత్త దశలో ఉన్నాను. ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నాను. ఈ 13 ఏళ్లలో పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. తొలిసారి గ్యాప్ తీసుకున్నాను. జీవితంలో ఈ దశ కొత్తగా ఉంది. ప్రస్తుతానికి ఖుషీగానే ఉన్నాను.”
ఇలా తన రియల్ లైఫ్ పై స్పందించింది సమంత. ఖుషి సినిమా ప్రమోషన్ లో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇలా రియాక్ట్ అయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంది. శారీరకంగా మరింత ఫిట్ గా తయారయ్యేందుకు, సినిమాల నుంచి గ్యాప్ తీసుకొని మరీ అమెరికాకు వెళ్లింది.
మరోవైపు హీరో విజయ్ దేవరకొండ కూడా తన జీవితంలో ఖుషి మూమెంట్స్ పై స్పందించాడు. రోజూ తల్లిదండ్రుల్ని చూడడం, నచ్చిన పని చేయడం, జిమ్ చేయడం తనకు ఆనందాన్ని కలిగిస్తాయని అన్నాడు.