సమంత, నాగచైతన్య జంట విడిపోయి ఎవరిమానాన వాళ్లు బతుకుతున్నప్పటికీ, వారిని మీడియా వదిలి పెట్టడం లేదు. వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని, ఎందుకు విడిపోయారో తెలియదని సమంత, నాగచైతన్యలకు సన్నిహితులు చెప్పడం విన్నాం. చూడ ముచ్చటైన జంట విడిపోవడం వల్ల అభిమానులు, ఇండస్ట్రీతో పాటు పౌర సమాజం షాక్‌కు గురైందనే ప్రచారం విస్తృతంగా సాగింది.
అయితే సమంత, నాగచైతన్య మధ్య అందరూ అనుకుంటున్నట్టు అన్యోన్యత లేదనే వాస్తవం ఆమె చెబితేనే తెలిసొచ్చింది. సమంత ఘాటు రియాక్షన్ చూసి షాక్ కావడం అందరి వంతైంది. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారంటే…
“మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేదు. ఒకవేళ మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలి” అని సంచలన కామెంట్స్ చేశారామె. ఈ మాటలు సరదాగా అన్నవి కాదనే విషయాన్ని గ్రహించాలి.
ఇద్దరి మధ్య సఖ్యత లేదనే వరకూ ఓకే. కానీ ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే, అక్కడ ఎలాంటి పదునైనవి లేకుండా చూసుకోవాలని చెప్పడం ద్వారా… వాటితో చంపుకునే ప్రమాదం లేకపోలేదని ఆమె బహిరంగంగానే చెప్పారు. సమంత వ్యాఖ్యల్లోని తీవ్రతను గమనిస్తే… పరస్పరం చంపుకోడానికి కూడా వెనుకాడనంతగా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందనే కఠిన వాస్తవాన్ని ఆమె బయటపెట్టారు.
నాగచైతన్యపై ఆమె ఆగ్రహం ఏ స్థాయిలో ఉందంటే… పొరపాటున “మీ భర్త” అని యాంకర్ ప్రస్తావించగా, “మాజీ భర్త” అని ఆమె సీరియస్‌గా చెప్పారు. అంటే నాగచైతన్యను పొరపాటున కూడా భర్తగా అంగీకరించలేనంత కోపం సమంతలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలని చిత్రపరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్థాయి శత్రుత్వం ఎందుకు ఏర్పడిందో వాళ్లిద్దరికే తెలియాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.