చైతూతో విడిపోయిన దగ్గర నుంచి సమంత చాలా మందికి చేదైపోయింది. చైతూ విషయంలో ఏం నెగిటివ్ జరిగినా దాన్ని సమంతకు, ఆమె పీఆర్ టీమ్ కు ముడేసి, కౌంటర్లు ఇవ్వడం అలవాటైపోయింది. ఇన్నాళ్లూ సమంత ఇలాంటివి చూసీ చూడనట్లు వదిలేసింది. కానీ ఇప్పుడు బలమైన కౌంటర్ ఇచ్చింది.
నిన్నటికి నిన్న బాలీవుడ్ మీడియాలో చైతూ కొత్త డేటింగ్ గురించి గ్యాసిప్ లు వచ్చాయి. శోభ ధూళిపాళతో డేటింగ్ లో వున్నాడన్నది ఆ గ్యాసిప్ ల సారాంశం. దాన్ని తెలుగు మీడియాలు కూడా క్యారీ చేసాయి. దాంతో చైతూ ఫ్యాన్స్ ఇదంతా సమంత పీఆర్ టీమ్ మహిమే అంటూ తమ హీరో ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.
దానికి ట్విట్టర్ లో సమంత సరైన సమాధానం ఇచ్చింది.
Rumours on girl – Must be true !!
Rumours on boy – Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!!
అంటూ సమంత బలమైన కౌంటర్ వేసింది. నిజమే కదా. తామిద్దరం ప్రశాంతంగా వేరు వేరు బతుకులు బతుకుతున్నాం…మీరు కూడా మారండి అంటూ క్లాస్ పీకి..మీ పని మీరు చూసుకోండని సుతిమెత్తగా అటాక్ ఇచ్చింది సమంత.
ఇకనైనా ఫ్యాన్స్ తమ హీరో ఫ్యానిజం కోసం సమంతను అటాక్ చేయడం మానేస్తారేమో చూడాలి.