డిజె టిల్లు తో సిద్దు జొన్నలగడ్డ క్రేజీ హీరోగా మారిపోయాడు. సమంత గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. స్పెషల్ సినిమాలు ఎంచుకుంటూ చేసుకుంటూ వెళ్తోంది.
ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మించే ప్రయత్నాల్లో వున్నారు రామ్ తాళ్లూరి. కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అందులో సందేహం లేదు. పైగా ఈ ప్రాజెక్టు కు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తారని వినిపిస్తోంది.
ఓ బేబీ లాంటి డిఫరెంట్ సినిమా, అన్నీ మంచి శకునములే లాంటి ఫీల్ గుడ్ సినిమా అందించారు నందినీ. ఆమెకు సమంత కు మంచి అనుబంధం వుంది. సమంతతో రెండు సినిమాలు చేసారు. ఇప్పుడు ఇది కూడా చేస్తే మూడో సినిమా అవుతుంది. రామ్ తాళ్లూరి గతంలో కొన్ని సినిమాలు నిర్మించి, కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
శాకుంతలం సినిమా సమంతకు నిరాశ మిగిల్చింది. అంతకు మందు యశోద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఖుషీ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. దాని తరువాత సినిమా సిద్దు కాంబినేషన్ లోనే.