డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సినిమాల కంటే నిత్యం ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయాల గురించి రకరకాల ట్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ గా ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ట్వీట్లు ప్రతి ఒక్కటి పట్టించుకోకపోయినా అప్పుడప్పుడు వర్మ ట్వీట్లు చూస్తే పాత రాంగోపాల్ వర్మ గుర్తుకు వస్తుంటారు. అలాంటిదే తాజాగా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలతో కూడిన విమర్శ చేశారు.
'పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకోవడం లేదు.. ఎందుకంటే ఆయన 'సీఎం' అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ రెండో సీఎం అంటే కన్ఫ్యూజ్డ్ మ్యాన్ కొత్త అర్థం చెప్పారు'. ఈ ట్వీట్ చూసిన పవన్ అభిమానులు కొంత మంది నిజమే కదా అని అంటూంటే.. మరికొంత మంది మాత్రం ఆర్జీవీపై మండిపడుతున్నారు.
కాగా గత వారంలో పొలిటికల్ టూర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ తనకు సీఎం కావాలనే ఆలోచన లేదని, తాను సీఎం కాలేనని రకరకాల కారణాలు చెప్పారు. పవన్ మాటలపై సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు.. వైసీపీ సోషల్ మీడియాకు వినోదాన్ని అందించిన విషయం తెలిసిందే. పవన్ పార్టీ పెట్టింది సీఎం కావడం కోసం కాదని.. చంద్రబాబు ను సీఎం చేయడానికి అంటూ సైటెర్లు వేస్తున్నారు.