సమంత..యశోద..ఉత్కంఠభరితం

సమంత లీడ్ రోల్ లో చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా యశోద. పక్కా థ్రిల్లర్. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేసారు. హరి-హరీష్ అందించిన…

సమంత లీడ్ రోల్ లో చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా యశోద. పక్కా థ్రిల్లర్. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేసారు. హరి-హరీష్ అందించిన ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. చాలా ఆసక్తికంగా కట్ చేసారు. 

థ్రిల్లర్ సినిమాలకు టీజర్ లు, ట్రయిలర్ లు కట్ చేయడం కాస్త క్లిష్టమైన పని. ఆసక్తి కలిగించేలా వుండాలి. మెయిన్ పాయింట్ రివీల్ కాకూడదు. ఇలా చాలా లెక్కలు వుంటాయి.

ఇవన్నీ చూసుకుంటూనే యశోద సినిమాకు కట్ చేసిన టీజర్ బాగుంది. టీజర్ కాన్సెప్ట్ గా ఒక్కో డైలాగు…దానికి నెగిటివ్ యాంగిల్ లో ఒక్కో సీన్ కట్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం మీద హీరోయిన్ కు ఎందుకు అంత కష్టం వచ్చింది..అన్ని బాధలు పడాల్సి వచ్చింది. అన్న క్వశ్చన్ రైజ్ చేసారు. ఆన్సర్ ను థియేటర్ కు వదిలేసారు. యశోదగా సమంత మినహా మరో నోటెడ్ క్యారెక్టర్ ఏదీ టీజర్ లోకి తీసుకోలేదు.

ట్రయిలర్ విడుదల ఎలాగూ వుంటుంది కనుక టీజర్ ను అంత వరకే పరిమితం చేసారు. టెక్నికల్ వర్క్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. మొత్తం మీద టీజర్ ఓ ప్రామిసింగ్ థ్రిల్లర్ అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేసింది.