సామీ..సామీ..మాస్..సామీ

రంగస్థలం 'మంగమ్మా..రంగమ్మా..' పాట ఎంత బ్లాక్ బస్టర్ అన్నది తెలిసిందే. మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయలనే ప్రయత్నమే పుష్ప సినిమాలో..సామీ..సామీ పాట. ఈ రోజు ఈ పాట విడుదలయింది. Advertisement చంద్రబోస్ రాసిన…

రంగస్థలం 'మంగమ్మా..రంగమ్మా..' పాట ఎంత బ్లాక్ బస్టర్ అన్నది తెలిసిందే. మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయలనే ప్రయత్నమే పుష్ప సినిమాలో..సామీ..సామీ పాట. ఈ రోజు ఈ పాట విడుదలయింది.

చంద్రబోస్ రాసిన సామీ..సామీ అంటూ సాగిన ఈ పాట అటు పిక్చరైజేషన్ కానీ ఇటు పక్కా మాస్ నెంబర్ గా తయారుచేయాలనే ఆలోచనతోనే సాగాయి. అడవి నేపథ్యంలో కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేసారు. రష్మిక ను, టీమ్ ను కూడా కలర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసారు.

అయితే రంగమ్మా..మంగమ్మా అంత క్యాచీ బీట్ అయితే కాదు ఈ సాంగ్. హుక్ లైన్ పక్కా క్యాచీగా వుంది కానీ, మధ్య చరణాలు మాత్రం ఆ రేంజ్ క్యాచీగా లేవు. శ్రీవల్లి పాటకు కూడా ఇదే సమస్య. హుక్ లైన్ బాగుంటుంది. క్యాచీగా వుంటుంది. కానీ చరణాల దగ్గరకు వచ్చేసరికి సమస్య.

చంద్రబోస్ సాహిత్యం బాగుంది. మౌనికయాదవ్ స్వరం బాగుంది. వినగా వినగా సామీ..పాట కూడా రీచ్ పెరుగుతుందనే అనుకోవాలి.