సందీప్ సినిమాలో గౌతమ్ మీనన్

కనులు కనులు దోచాయంటే సినిమాతో గౌతమ్ మీనన్ నటుడిగా జనాలకు బాగా పరిచయం అయిపోయారు. డైరక్టర్ గా పేరున్న ఆయన నటుడిగా ఫిక్స్ అయిపోయారు ఆ సినిమాతో. లేటెస్ట్ గా ప్రధాన ప్రతి నాయకుడిగా…

కనులు కనులు దోచాయంటే సినిమాతో గౌతమ్ మీనన్ నటుడిగా జనాలకు బాగా పరిచయం అయిపోయారు. డైరక్టర్ గా పేరున్న ఆయన నటుడిగా ఫిక్స్ అయిపోయారు ఆ సినిమాతో. లేటెస్ట్ గా ప్రధాన ప్రతి నాయకుడిగా తెలుగు సినిమాలోకి కూడా ఎంటర్ అయిపోయారు. 

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి లాంటి మల్టీస్టారర్ కాంబినేషన్ లో నిర్మాత ఆసియన్ సునీల్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మైఖేల్ అని టైటిల్ పెట్టారు. దర్శకుడు రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పుడు ఈ  చిత్రంలో విలన్‌గా గౌతమ్ మీనన్ ను తీసుకున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పిస్తున్న ఈ సినిమాకు భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు సహ నిర్మాతలు. చాలా సినిమాలు డిస్సపాయింట్ చేసిన తరువాత ఎ1 ఎక్స్ ప్రెస్ తో కాస్త హుషారు వచ్చింది

సందీప్ కిషన్ కు. ఇకపై పక్కా సబ్జెక్ట్, కాన్సెప్ట్ బేస్డ్ గానే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే ఈ భారీ సినిమా చేస్తున్నాడు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ సందీప్ కిషన్ సినిమాలో ఇదే తొలిసారి.