ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న బహుభాషా చిత్రం మైకేల్. సందీప్ కిషన్..విజయ్ సేతుపతి, దివ్వాంశ లాంటి తారాగణం వున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇంత భారీ సినిమా లేదు. దాదాపు ముఫై కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు రంజిత్ జయ్ కోడి పని చేస్తున్నారు. తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ దర్శకుడు మైకేల్ తీస్తున్న తీరు అప్పుడెే ఇండస్ట్రీలో గట్టిగానే పాకేసింది. దాంతో అవకాశాలు లైన్ కడుతున్నాయి. ఇప్పుడు టీజర్ విడుదల కావడంతో కచ్చితంగా మంచి దర్శకుడిగా నిలదొక్కుకుంటారు.
రివెంజ్ డ్రామా అనిపించేలా టీజర్ ను కట్ చేసారు. అవుట్ అండ్ డార్క్ థీమ్ యాక్షన్ సీన్లు టీజర్ లో చోటు చేసుకున్నాయి. పగతీర్చుకోవడమే లక్ష్యం తప్ప మంచివాడిగా వుండాలనుకోవడం కాదు అనే హీరో క్యారెక్టరైజేషన్ చెప్పడమే టీజర్ లక్ష్యంగా కనిపిస్తోంది. టీజర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. కొత్తగా వుంది.
భరత్ చౌదరి, సునీల్ నారంగ్,రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేస్తారు.