కరణం మల్లేశ్వరి బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న యంగ్ డైరెక్టర్ సంజన రెడ్డి ఇంకొక పెద్ద సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రం ప్రముఖ నిర్మాత కె ఎల్ దామోదర ప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ లో ఉంటుంది.
దామోదర ప్రసాద్ గారు గత సంవత్సరం నాలుగు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి కంప్లీట్ అయింది కూడా. మిగతా మూడు ప్రాజెక్ట్స్ తో పాటు ఈ సంజన ప్రాజెక్ట్ కూడా చేయాలనీ నిర్ణయించారు. ఈలోపు సంజన మల్లేశ్వరి బయోపిక్ కంప్లీట్ చేసుకొని తరువాత చిత్రంగా దామోదర ప్రసాద్ తో వర్క్ చేస్తారు.
సంజన ఇంతకు ముందు రాజుగాడు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. నిర్మాత దామోదర ప్రసాద్ గారిని రాజుగాడు సినిమా అయ్యాక చాల సార్లు కలిశానని అప్పుడు ఒక చిన్న లైన్ వినిపించానని అది ప్రసాదు గారికి నచ్చటంతో డెవలప్ చెయ్యమన్నారని చెప్పారు సంజన. అయితే తాను కొంచెం సిక్ అవ్వటం వల్ల హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందని, ఇప్పుడు బాగానే వున్నానని మల్లీశ్వరి బయోపిక్ వర్క్ నడుస్తోందని అన్నారు.
కొద్దీ రోజుల క్రితం దామోదర ప్రసాద్ గారు ఫోన్ చేసి తన హెల్త్ గురించి వాకబు చేసినప్పుడు ఆ కథ గురించి కూడా అడిగారని, దాము గారికి కథ వినిపించా అని అతను చిన్న చిన్న మార్పులు చెప్పి ఈ సినిమా చేస్తున్నట్టు చెప్పారు. మల్లీశ్వరి బయోపిక్ కంప్లీట్ చేసాక ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారని తెలిసింది. ఒక ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ తో ఈ ఉంటుందని సమాచారం.