బాలీవుడ్ అది మిస్సయింది – సంజయ్ దత్

బాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ పై , వస్తున్న సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు సంజయ్ దత్. భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసే మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం మిస్సయ్యాయని,…

బాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ పై , వస్తున్న సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు సంజయ్ దత్. భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసే మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం మిస్సయ్యాయని, అందుకే జనం హిందీ సినిమాలు చూడడం తగ్గించేశారని అన్నారు.

“బాలీవుడ్ సినిమాల్లో హీరోయిజం పోయింది. సౌత్ సినిమాల్లో అది కనిపిస్తోంది. హీరోయిజం, మాస్ అప్పీల్ అనేది భారతీయ సినిమా మూలాలు. ప్రేక్షకులు ముంబయి, హైదరాబాద్ నుంచి మాత్రమే రారు. జార్ఖండ్, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఆడియన్స్ ఉన్నారు. వాళ్లకు హీరోయిజం కావాలి. థియేటర్లలో వాళ్లు ఈలల వేయాలనుకుంటారు. ఆ ఆడియ్స్ ను బాలీవుడ్ కోల్పోయింది. ప్రస్తుత పరిస్థితికి అదే కారణం.”

హీరోయిజం, మాస్ అప్పీల్ తో ప్రస్తుతం సౌత్ నుంచి మాత్రమే సినిమాలొస్తున్నాయని, అందుకే అవి దేశవ్యాప్తంగా ఆడుతున్నాయని అన్నారు సంజయ్ దత్. ఒకప్పుడు తామంతా అలాంటి సినిమాలు చేశామని, ఇప్పుడది హిందీలో మిస్సయిందని అన్నారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటించారు సంజయ్ దత్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది.

5 Replies to “బాలీవుడ్ అది మిస్సయింది – సంజయ్ దత్”

Comments are closed.