పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అంటే గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి మెగా స్టార్ గా ఎదిగాడు శివ శంకర్ వరప్రసాద్ అనబడే చిరంజీవి. రాజకీయాల్లో తన జాతకం చూసుకుందామని అనుకొని…

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అంటే గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి మెగా స్టార్ గా ఎదిగాడు శివ శంకర్ వరప్రసాద్ అనబడే చిరంజీవి. రాజకీయాల్లో తన జాతకం చూసుకుందామని అనుకొని సొంత పార్టీ పెట్టాడు. కానీ ఆయన రఫ్ అండ్ టఫ్ కాకపోవడంతో రాజకీయాల్లో రాణించలేకపోయాడు.

అఫ్కోర్స్ .. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని గుంజుకొని కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిందనుకోండి. కానీ ఎందుకో రాజకీయాల్లో కొనసాగడానికి భయపడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే, తన రాజ్యసభ సభ్యత్వం పూర్తి కాగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

కానీ చిరంజీవి మెగా స్టార్ గానే కాకుండా, ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయన తమ పార్టీలోనే ఉన్నాడని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. సరే… అది వాళ్ళ తృప్తి. చిరంజీవి తాను మెగా స్టార్ గా ఎదగడమే కాకుండా, తన ఇద్దరు తమ్ముళ్లను నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ ను సినిమా రంగంలోకి తెచ్చాడు.

నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టు అయ్యాడు. కొన్ని టీవీ కార్యక్రమాలు చేశాడు. పవన్ అలియాస్ పవర్ స్టార్ పెద్దన్న బాటలో రాజకీయాల్లోకి ఎంటరయ్యాడు. చిరంజీవితో కంపేర్ చేస్తే తమ్ముళ్లద్దరూ ఆవేశపరులు. చిరంజీవి మర్యాద రామన్న టైపు. కానీ తమ్ముళ్లు అలా కాదు. ఈ గుణం పవన్ కళ్యాణ్ లో కాస్త ఎక్కువ కాబట్టి రాజకీయ పార్టీ పెట్టాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలకు తగ్గట్లే ఉన్నాడు. నాగబాబు కూడా పవన్ ను అనుసరించాడు. జనసేనలో ఓ పదవి కూడా ఉంది. చిరుకు, పవన్ కు తేడా ఏమిటంటే.. తన స్వభావానికి రాజకీయాలు పడవని డిసైడ్ చేసుకొని చిరు వదులుకున్నాడు. కానీ పవన్ మాత్రం తాడోపేడో తేల్చుకోవాలని అనుకున్నాడు. ఒక ఎన్నికల్లో దారుణంగా విఫలమైనా ఓపిక పట్టి మరో ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి మొన్న జరిగిన ఎన్నికల్లో వందశాతం విజయం సాధించాడు. మంత్రి అయ్యాడు.

ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి దిగినట్లే. పూర్తి చేయాల్సిన సినిమాలు మూడో నాలుగో ఉన్నాయి. అవి పూర్తయ్యాక పూర్తి రాజకీయ నాయకుడైపోతాడు. మరి పొలిటీషియన్ అన్న తరువాత విమర్శలు వస్తాయి. ప్రత్యర్థులు తిట్లు తిడతారు, శాపనార్థాలు పెడతారు ఇవన్నీ తట్టుకోవాలి. ఎదురుదాడి చేయాలి. కాబట్టి చేతిలో సొంత మీడియా ఉండాలి.

గతంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో ఒక పార్టీ పెట్టిన టీవీ ఛానెల్ ను పవన్ కొన్నట్లు చెప్పుకున్నారు. అయితే నాగబాబు కూడా పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా కావొచ్చు ఎన్ మీడియా అనే ఛానెల్ పెడుతున్నట్లు వార్త వచ్చింది. ఆఫీసు కూడా ప్రారంభించారు. కూతురు నీహారిక కూడా ఇందుకు సహకారం అందిస్తోంది.

తండ్రీ కూతుళ్ళిద్దరికీ మీడియాలో అనుభవం ఉంది కదా. ప్రస్తుతం ఇది యూ ట్యూబ్ ఛానెల్ గా ప్రారంభమవుతోంది. భవిష్యత్తులో శాటిలైట్ ఛానెల్ గా మారుతుందని అంటున్నారు. మరి దీని వెనుక చిరంజీవి ఉన్నాడో లేదో తెలియదు.

13 Replies to “పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!”

  1. Kaapu yuvatha ku Kula spruha ye meraku undo monna election lalo telidipoyindi. EVM gambling 100% jarigindi.pawan ku ilanti vijayam bhavishyth lo eppudoo undadu. Mana kulamodu vaste nellu amrutham avutaya.

Comments are closed.