అవును..నిజమే కదా..ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఇవన్నీ ఆయన డిస్ట్రిబ్యూషన్ నే కదా. కొత్తేముంది అని అనేయద్దు. అసలు విషయం వేరు. కరోనా మూడో దశ కారణంగా ఆర్ఆర్ఆర్. రాధేశ్యామ్ వాయిదా పడతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సంక్రాంతి దిల్ రాజుది ఎలా అవుతుంది అన్న సందేహం మళ్లీ రావచ్చు.
కానీ విషయం అది కాదు. ఆయన సోదరుడి కుమారుడు హీరోగా రౌడీ బాయ్స్ అనే ప్రేమదేశం రీమిక్స్ టైపు సినిమా ఒకటి చేసి వున్నారు. అది ఎప్పటి నుంచో సరైన డేట్ కోసం అంటే అటు రెండు వారాలు, ఇటు రెండు వారాలు మరే సినిమా లేకుండా వుండే వీలు కోసం చూస్తూ పక్కన పెట్టి వుంచారు.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రాకపోతే, సంక్రాంతి బరిలోకి దిగేది ఆ సినిమానే. నాగ్ బంగార్రాజు ఎలాగూ వుంటుంది. సితార సంస్థ నుంచి డిజె టుల్లు వస్తుంది. భీమ్లా నాయక్ డేట్ వాయిదా పడడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆపేసారు. లేదూ అంటే అది వుండేది.అలాగే ఆచార్యకు రీషూట్ లు పెట్టడంతో అది కూడా లేదు.
అందువల్ల రౌడీ బాయ్స్ కు మాంచి సూపర్ స్లాట్ దొరికినట్లే.