Advertisement

Advertisement


Home > Movies - Movie News

సంక్రాంతి పండగే..పండగ

సంక్రాంతి పండగే..పండగ

అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటాడు శ్రీశ్రీ ఓ కవితలో. 2024 సంక్రాంంతి అలాగే వుండబోతోంది. అటు చూస్తే ప్రాజెక్ట్ కె..ఇటు చూస్తే మహేష్-త్రివిక్రమ్. 

రెండు మాంచి సినిమాలు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. ఈ పోటీ నుంచి రామ్ చరణ్-శంకర్ సినిమా అయితే తప్పుకుంది. సమ్మర్ కు వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా వస్తాయా అన్నది అనుమానమే. త్రివిక్రమ్ సినిమా వుంటే పవన్ తన సినిమా ఎందుకు వేయనిస్తారు?

ఆగస్ట్ 11న విడుదల చేస్తామని చెప్పారు. చేయాలనే అనుకున్నారు మహేష్ సినిమాను. కానీ అదే డేట్ కు సడెన్ గా మెగాస్టార్ భోళాశంకర్ సినిమా డేట్ వేసారు. దాంతో వేరే డేట్ కావాల్సి వచ్చింది. ఇంక అంత లెవెల్ సినిమా విడుదల చేయాలంటే సంక్రాంతి కన్నా గొప్ప సీజ‌న్ మరోటి లేదు. అందుకే అదే సీజ‌న్ కు ఫిక్సయిపోయింది మహేష్ సినిమా.

ప్రభాస్ ప్రాజెక్ట్ కె  కు ఒక రోజు ముందుగా రావాలా? లేదా సేమ్ డేట్ కు రావాలా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఫ్యాన్స్ కోసం ఓ మాంచి యాక్షన్ స్టయిలిష్ పోస్టర్ వదిలారు. కృష్ణ గారి బర్త్ డే కు గ్లింప్స్ తో పాటు టైటిల్..డేట్ రావచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?