హిట్ సాంగ్స్ లేకుండానే సంక్రాంతి బరిలోకి..!

ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలున్నాయి. వీటిలో గుంటూరుకారం, హనుమాన్ సినిమాలు ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ సినిమాలపై ఉన్న అంచనాల సంగతి పక్కనపెడితే, ఓ కామన్ పాయింట్…

ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలున్నాయి. వీటిలో గుంటూరుకారం, హనుమాన్ సినిమాలు ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ సినిమాలపై ఉన్న అంచనాల సంగతి పక్కనపెడితే, ఓ కామన్ పాయింట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే, సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాల్లో ఎందులోనూ పాటలు క్లిక్ అవ్వలేదు.

గుంటూరుకారం సినిమాలో పాటలపై మొదట్నుంచి విమర్శలున్నాయి. అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ తో కంపేర్ చేసిన ఆడియన్స్ నిరుత్సాహపడ్డారు. 'కుర్చీని మడతపెట్టి' అనే సాంగ్ వైరల్ అయింది కానీ హిట్టవ్వలేదనే విషయాన్ని గుర్తించాలి.

ఇక హనుమాన్ పరిస్థితి కూడా ఇంతే. ముగ్గురు సంగీత దర్శకులు కలిసినా ఈ సినిమాకు హిట్ ఆల్బమ్ ఇవ్వలేకపోయారు. సైంధవ్ సినిమాలో పాటల్ని ఆడియన్స్ మాత్రమే కాదు, మేకర్స్ కూడా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏదో వదలాలి కాబట్టి సాంగ్స్ రిలీజ్ చేసినట్టుంది.

నా సామిరంగ సినిమాలో కనీసం ఒక్క పాటైనా పెద్ద హిట్టవుతుందని జనం అనుకున్నారు. ఎందుకంటే, ఇది కీరవాణి సినిమా, పైగా నాగార్జునతో కాంబినేషన్. గత ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకొని చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ నా సామిరంగ సినిమా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది.

విడుదలకు ముందే పాటలు హిట్టయితే ఆ సినిమాకు ఎక్స్ ట్రా మైలేజీ. పైగా సంక్రాంతి సీజన్ లో అలాంటి టాక్ సంపాదిస్తే, మరింత అడ్వాంటేజీ. కానీ ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు మాత్రం ఆ మేజిక్ ను రిపీట్ చేయలేకపోయాయి. సో.. కంటెంట్ తో మెరవాల్సిందే.