సంక్రాంతి సీజన్ లో ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో హను-మాన్ సినిమా మాత్రమే ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడుతోంది. ఇప్పుడీ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం రెడీ అవుతున్నాయి.
ఫ్లాప్ అయిన సినిమాలు ముందుగా ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ ఆనవాయితీ ప్రకారం, సంక్రాంతి సినిమాల నుంచి ముందుగా సైంధవ్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. వెంకీ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్, ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సైంధవ్ తర్వాత గుంటూరు కారం సినిమా ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి రెండో వారంలో (వీలైతే 16వ తేదీన లేదా అంతకంటే ముందు) ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
ఇక నా సామిరంగ సినిమా కూడా అదే టైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఫిబ్రవరి 15న ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాన్ చేస్తోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయింది.
ఇక మిగిలిన సినిమా హను-మాన్. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 దక్కించుకుంది. అగ్రిమెంట్ ప్రకారం రిలీజైన 3 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఇంకా థియేటర్లలో నడుస్తుండడంతో, అగ్రిమెంట్ ను సవరించారు. 55 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత జీ5లో స్ట్రీమింగ్ కు రాబోతోంది హను-మాన్ సినిమా.
ఇక రిపబ్లిక్ డేకు వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. అటు అయలాన్ సినిమా కూడా ఫిబ్రవరి 16న సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.